పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/815

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పనిలేనిపాట

919


వచ్చునుగాని బ్రాహ్మఁడుగా పుట్టి కాలం గడుపుకోవడానికి అవకాశం లేదుకదా? యింకా వారితగాయిదా పూర్తిగా తీరినట్లేలేదు. యేమో అడుగుతారఁట? నన్నడిగితే చిక్కులేదు. కాని గురువుగారి నడిగితే, వెంll శాII ప్రేరేపించాడని వ్రాస్తారు. యీ వివాదలో యితరులు జోక్యం కలిగించుకోకుండా నా శాయశక్తులా ప్రయత్నిస్తూ వున్నాను. ఓగిరాల సుబ్బారావుగారిని గురువుగారున్నూ శిష్యుఁడు బ్రహ్మంగారున్నూ దూషించినందుకు ఆయన మృదువుగానే అనుకుందాం యేదో వ్రాసి నావద్దకు పంపినారు. దాన్ని తొక్కి పెట్టి మీరు కలగజేసికోవద్దని వ్రాసి ఆపినాను. బ్రహ్మంగారు "సుధర్మ" లో యేదో వ్రాస్తే అది గురువుగారి ప్రేరణ కలవ్రాఁతే అని నేననుకున్నా లేదా? అట్లే యీ వడ్డెకులస్థులు గురువుగారి నేమైనా ప్రశ్నిస్తే అది నా ప్రేరణ కలదిగా గురువుగారే కాదు. పరిశీలన లేని లోకులు కూడా కొందఱు విశ్వసిస్తారు. కాఁబట్టి వారిని నేను కోరే దేమిటంటే? గురువుగా రెవరి నేమన్నప్పటికీ అవి నామీఁద కోపాన్ని పురస్కరించుకొన్నవే కనక మీరెవ్వరున్నూ కలగఁజేసుకోవద్దు, అది నాకు అపకారకము అనియే. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రులవారు పాపం వృథాగా కలిగించుకున్నారు. గురువుగారు వారికిచ్చిన జవాబు మాత్రం మిక్కిలి సమంజసముగా వుంది. దానితో వారు యోగ్యులుకనక తప్పుకున్నారు. యేదేనా వ్రాసినప్పటికీ పర్యవసానంలో ఉదారత్వాన్ని చూపిస్తే లోకం సంతోషిస్తుంది. అంతేనేకాని వ్రాసిన వాక్యాలన్నీ వకరు ఖండించకుండానే వాటంతట అవే ఖండింపఁబడుతూ వుంటే వ్రాసే వ్రాఁతల వల్ల ప్రయోజనం వుంటుందని యెవరో కాని అనుకోరు. "వాటంతట అవే ఖండింపఁబడే వంటూ వ్రాస్తావుకదా? అట్టి నమ్మికేవుంటే కొంచెమే అందాం. ఆ మాత్రమేనా గురువుగారి ధోరణ్ణి నీ వెందుకు ఖండిస్తూవున్నావు" అని అడుగుతా రేమో? తప్పే అని వప్పుకుంటాను. వకాయన మందలింపు వ్రాస్తూ వ్రాశారుకదా? “గురువుగా రాపాదించారన్న అపవాదలకు మీరేదో మొదట కొంత వ్రాశారు. అది కొంతవఱకు యుక్తమే. యిటీవల గురువుల ధోరణి బొత్తిగా నక్షత్ర మండలానికి పైఁగా నడుస్తూ వుంది. దీన్ని గుఱించి వారు నన్నేమన్నాసరే పత్రికలో కాదుకాని వారికే వ్రాయలనుకుంటూ వున్నాను. వ్రాస్తే వ్రాస్తా నేమో కూడా. మీరు మాత్రం యేకొంచెమో వ్రాసి సమాప్తి చెప్పండి” అని సలహాయిచ్చారు. దానిమీఁద యీకాస్తా వ్రాస్తూ వున్నాను. కాని కేవలమున్నూ స్వబుద్ధిచేతకాదు. గురువుగారి హృదయం చాలా మంచిదని నే నెఱుఁగుదును. కాని అవిమృశ్యకారిత్వం వారివద్ద అనాదిగా వుంది. దాని మూలాన్ని వ్రాసేవ్రాఁత - యేలావుండాలో అలా వుంటుంది. విశ్వకర్మ శిష్యుణ్ణి గొప్పచేయడానికి బ్రాహ్మణ శిష్యుల్ని అధఃకరించడం యెందుకు? "శ్మశానవృక్షంగా పుడతావు నీ” వని నన్ను తిట్టడానికి బాలసరస్వతీ బిరుదానికి అపవ్యాఖ్యానం చేయడం యెందుకు?