పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/813

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పనిలేనిపాట

917


నిది యెంతపాటిది? అని వుపేక్షించి వూరకున్నాను. యింతలో నాకు భార్యావియోగం తటస్థించడం చేత పలువురుతోపాటు పరామర్శ వుత్తరం వ్రాశాఁడు ప్రభాకరశాస్త్రి. దానిలో వకమాట. గురువుగారు తనపై మోపిన నిందనుగూర్చి యెత్తుకుంటూ దాని స్వరూప మెట్టిదంటూ ప్రశ్నించాఁడు. యిట్టిదని "కృష్ణలో" వున్న మాటల నుదాహరించాను. దానిమీఁద మళ్లా తాను వస్తూవున్నానని వ్రాస్తూ యీక్రింది మాటలు వ్రాశాఁడతఁడు.

“శ్రీకృష్ణమూర్తి శాస్త్రులుగారు నన్ను గూర్చి వ్రాసినట్లుగా మీ రుదాహరించిన వ్రాత నాకు విడ్డూరముగా ఉన్నది. నా జీవితములో ఎన్నడు గాని వారితో అట్టి ప్రసంగము జరిపినట్లు స్మరింపజాలకున్నాను. నాకు మతి మళ్లిపోలేదు. జ్ఞాపకశక్తి తగ్గిపోలేదు. నా జీవితకాలములో కృష్ణమూర్తిశాస్త్రులగారితో కలసిమాటాడిన సందర్భములే చాల తక్కువ సంఖ్యకలవి. కీర్తి శేషులు తిరుపతిశాస్త్రిగారు ఎన్నడుగాని కృష్ణమూర్తిశాస్త్రిగారి ప్రశంస నాతో తేలేదు. వారు నేనుకలసికొన్న సందర్భములుకూడా చాలా తక్కువ సంఖ్యకలవే. అది మీ రెఱుఁగుదురు.”

యిత్యాదులు ప్రభాకరశాస్త్రి కార్డులోని మాటలు. ప్రభాకరశాస్త్రికిని గురువులకును యెదోకొంత విద్యావిషయమున చాలానాళ్లనాఁడు మనస్పర్ధలు కలిగినట్లు జ్ఞాపకం. అది నిజమే అయితే పనిలోపనిగా అతణ్ణి అధఃకరించుట కీకల్పనలో ఒక పాత్రగా గురువులు తీసికొని వుండాలి. విశ్వకర్మ శిష్య ప్రశంసాధ్యాయంలో సుస్వభావ విషయంలోవున్న అధఃకృతిలో యితఁడున్నూ పడతాడుగనుక “యిట్టి దుస్వభావులు నిజం వ్రాస్తారు కనకనా" అని ఖండిస్తే ప్రభాకరం వుత్తరం ధూళిధూళిగా యెగిరి పోతుందని యెఱిఁగిన్నీ ఉదాహరించాను. మాయీవాదాన్ని అతఁడు బొత్తిగా సమ్మతించేవాఁడు కాఁడు. యీ మాటలు చూడండి.

"నేనీ దుఃఖజనకమైన వివాదమున ఇఁక చెవి జొన్పను. మీరును నుపేక్షింపఁ గల్గిన సంతోషింతును.”

యితఁడిట్టి వివాదముల విషయమే కాదు. యితర విషయములకు గూడ విముఖుఁడే అయి యేదోరీతిని కాలక్షేపము చేయుచున్నట్టు శ్రీయుతులు విస్సా అప్పారావుపంతులు యం.ఏ.యల్.టి. (గవర్నమెంటు కాలేజి ప్రిన్సిపాల్, రాజమండ్రి) గారి వలనవింటిని. కాని అతఁడు యీ విషయమున నీ రెండుమాటలు మాత్రమేలవ్రాయవలెను అన్నది విచార్యం. నేనేమో గురువుగారు వ్రాసే పెద్దపెద్ద వ్యాసాలలోవున్న ప్రతి మాటనూ యెత్తుకొని ఖండించడానికి మొదలుపెట్టి కోలాహలం చేస్తాననే యూహ అతనికే కాదుచాలామందికి