పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/811

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పనిలేనిపాట

915


"జాతక చర్య"లో వున్న యథార్థాంశానికి అది భంజకమవుతూ వుంది. దాని నిజానిజాలు తేల్చుకోవడానికి వెం||శా|| వ్యాసాలు వ్రాయవలసి వచ్చింది. దానిమీఁద అంతకు పూర్వమేవున్న కోపం గురువులకు మరింత హెచ్చింది. మొదట ఆ వ్రాఁత ప్రమాదమేమో అన్నారు. యిపుడు తిరిగీ ప్రమాదం కాదని సమర్ధించడానికి మళ్లా సంవత్సరం కాలానికి తగ్గదని వ్రాస్తూ వున్నారు. యెవరో నాకు సేల్వులిచ్చి తమ మీఁదకు పురికొల్పినట్లు వక కల్పన. ఆయన నాకింటికి తెచ్చియిచ్చింది సేలువుకాదు. సేలంపట్టు కండువా, మాచిరంజీవి అవధాన సభలో యిచ్చింది సేలువున్నూ చేతి కఱ్ఱయున్నూ యీ వార్ధక్యంలో యీ గడ్డితిని గురువుల మీఁదకు నేను యుద్ధానికి ఢీకొన్నానంటె విశ్వసించే లోకం వుందనే గురువులవారి నమ్మిక. మాలో మేమీలా వాదాలాడుకుంటూ వుంటే మధ్యవారు వారిలో వారికుండే కోపాలు తీర్చుకోవడానికి అన్యాపదేశ ప్రసంగాలు. అందులో బుద్ధిపూర్వకంగానో ప్రమాదంగానో దైవాని కెరుక. మేముకూడా చిక్కుకోవడం, అందులో కసితీరేటట్టు వొకరి నొకరు తిట్టడం. యెఱుఁగని లోకులు వీరుకూడా యెఱిఁగే వుంటారనుకోవడం యిన్నివిధాలుగా వుంది మావాదం. ఫలాపేక్షతో నేనెవరి కవిత్వాన్నో పొగిడేనంటూ గురువుగారు వ్రాశారు. ప్రస్తుత కవిత్వాన్ని గురువుగారు పొగిడారు. యేదో ఫలాపేక్ష వుండక తప్పదు, నిశ్చయం. నా జీవిత చరిత్రలో “జాషువా" కవిని ప్రశంసించాను. దానికేమి ఫలితమో! తోఁచినట్లల్లా వ్రాస్తారు గురువుగారు. వారిదయవల్ల భగవంతుఁడు నాకు అన్నోదకా లిచ్చాఁడు. ఆత్మవంచనచేసి బాగులేని కవిత్వాన్ని బాగుందనికాని, బాగున్నకవిత్వాన్ని బాగులేదనికాని తెగడడం, పొగడడం, యివి నాపనులుకావు యీ పనులెవరివో ఋజువుచేయమంటే ఋజువుచేస్తాను. యెవరు పంపినా అందులో గుణమున్నా లేకపోయినా వున్నంతలోనే వెదకి కనపడ్డ స్వల్పాన్నే గొప్పచేసి అభిప్రాయ మివ్వడం కలదు. దానికిన్నీ నా జీవితచరిత్రలో నేను వ్రాసే వ్రాఁతకున్నూ చాలా భేదం వుంటుంది. యెంతో నచ్చిన కవిత్వమయితేనేగాని జీవిత చరిత్రలో నేను యెత్తుకోవడం తటస్థింపదు. అందుచేత యెవరినో యెందుకోమెచ్చి కార్యసాఫల్యం చేసుకున్నాఁడు వెం||శా|| అని వ్రాయడం అసూయామూలకం. ఆ మహారాజు యీ కవితా ప్రసక్తికి పూర్వమే నన్నాహ్వానించి వుండడం గురువుగా రెఱుఁగ రనుకుంటాను. ఆ ఆహ్వానానికి పూర్వం "రాజసందర్శనం"లో ప్రచురించిన అభినందన పద్యాలు కారణమని వ్రాస్తే కొంత బాగుండేది. కోపం మీఁద వ్రాసే వ్రాఁతకు అర్థమే వుండనప్పుడు హేతు హేతు మద్భావం యెక్కడ వుంటుంది? నా ప్రకృతి యెట్టిదో సందర్శనం వగయిరా పుస్తకాలు చదివిన లోకులు యెఱిఁగేవుంటారు. కాఁబట్టి విస్తరించేదిలేదు. నాకున్నూ గురువులకున్నూ గల అభిప్రాయ