పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొత్తరకం ఈతి బాధలు

85


విద్యావిషయాన్ని విచారిస్తే యిప్పటి స్కూళ్లుకూడా యీతిబాధలకిందకే వస్తాయి. అప్పడు సంవత్సరానికి వకసారి. కొన్నింటికి రెండుసార్లు కాంబోలు పరీక్ష చేసేవారు యిన స్పెక్టర్లు. యిప్పడో "ముద్ద ముద్దకీ బిస్మిల్లా" అన్నట్టు యెప్పుడూ పరీక్షలే, అయినా ప్రయోజనం శూన్యం. అయిదేళ్లు యెలిమెంటరీ స్కూలులో చదివిన వొకపిల్లవాండికి రఘువంశం మొదలెట్టి చెప్పవలసివస్తే వర్ణక్రమం దగ్గిఱనుంచీ, చెప్పవలసివచ్చి "సన్యాసాడి పెళ్లికి జుట్టుదగ్గిఱనుంచీ యెరు” వన్నట్టు కనపడింది. విద్యాశాఖకు అవుతూవున్న వ్యయం బోలెండు కనపడుతుంది. విద్యగతి యిలావుంది. పూర్వంకన్న విద్య చాలా వ్యాపకస్టితిలో వున్నట్టు రిపోర్టులవల్ల పై అధికారులు తెలుసుకొని తృప్తిపడుతూవుంటారు. అయితే వకటిమాత్రంవుంది. పూర్వకాలంలో ప్రతివ్యక్తికిన్నీ చేవ్రాలుచేసే శక్తి కూడా వుండేదికాదు. యిప్పడాలాకాదు. నూటికి యేభై మందికేనా మాతృభాషలోనేకాదు; హూణభాషలోకూడా చేవ్రాలుచేసే శక్తి మట్టుకేనా కనపడుతుంది యెంతోసొమ్మ గవర్నమెంటు వ్యయపఱచ డానికి యుదేఫలిత మయేయెడల-“మహతా ప్రయత్నేన లట్వాలి.__కృష్యతే అన్నట్టవుతుంది. ෂටඹී? పెద్ద బ్రహ్మాండమంత ప్రయత్నంచేసి వకచిన్న పిట్టను పట్టుకొన్నాండన్నట్టయింది. కాCబట్టి యిప్పటి పల్లెటూరి స్కూళ్లున్నూ యీతిబాధలలోకే చేరతాయి. యింక ముందు నిర్బంధ విద్యా విధానంకూడా వస్తే యితరత్ర చదువుకొని బాగుపడేవాళ్లుకూడా యీ స్కూళ్లలోకి వెళ్లిచెడిపోవలసిన దుస్థితి తటస్థిస్తుంది కాంబోలును. యొక్కడో నూట నాట తప్ప యింట్లోకాని అన్యత్రగాని చదువుకొని బాగుపడవలసిన వీళ్లు కూడా నశించి చాలాకాలమయింది. నా చిన్నతనంలో పల్లెటూళ్లల్లోనే కాదు; పట్నవాసాల్లో కూడా ప్రైవేటుట్యూషన్లంటూ వున్నట్టెఱంగను. యిప్పుడో శివారు గ్రామాల్లోకూడా యీ ట్యూషన్లు వ్యాపక స్థితిలో వున్నాయి. వకటీ, రెండూదాంకా జీతాలున్నూ యిస్తారు. యీ సందర్భంలో జ్ఞాపకం వచ్చింది. నేను రఘువంశం మొదలెట్టేముందు వకతేలీ గృహస్టు నన్ను తనపిల్లవాండికి రోజూవచ్చి కాస్తసేపు చదువు చెప్పవలసిందని కోరాండు. వకనెల్లాళ్లు కాంబోలు చెప్పాను. నా సరదా తీరేదాకా గానుగుబల్లమీఁద యొక్కితిరిగేవాణ్ణి అర్థరూపాయి కాCబోలును జీతం యిచ్చేవాఁడు. యిప్పడామాత్రం చదువుకు జీతం హెచ్చుగానే దొరుకుతుంది కాని అప్పుడు ఆ అర్థరూపాయితో జరిగినపనిలో యిప్పుడు యెన్నో వంతూ రెండురూపాయిలతో జరగదు. ఆ కాలంలో రూపాయికి యెనిమిది సేర్లబియ్యం అమ్ముతున్నారంటే? పెద్దకరువు వచ్చిందన్నమాటే! అలా అమ్ముతూ వున్నరోజుల్లోనే దత్తమండలాన్నుంచీ, గుంటూరు డిఫ్రిక్టు నుంచీ యెన్నో కుటుంబాలు మా గోదావరిజిల్లాకు వలసవచ్చాయి. ఆ కుటుంబాల నన్నిటినీ వకయేడో రెండేళ్లొ శ్రీ బచ్చు రామేశంగారు పోషించి పరలోకంలో శాశ్వతమైన వున్నతస్థానాన్ని సంపాదించుకొన్నారు. కాకినాడ