పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/807

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పనిలేనిపాట

911


ఆరోపించవచ్చునా? వూరికేగాలి మాటలే కాకుండా వాట్లను "శృంఖల” గ్రంథంలో వ్రాయడమెందుకు? అట్టిస్థితిలో వాట్లయాథార్థ్యం తెల్పడానికి శిష్యుఁడేమో అక్షరాలు వ్రాసుకుంటే యీ కోపం యెందుకు? వృథాగా లోకానికి కటువుగా వుండేతిట్లేందుకు? అసత్యాలెందుకు? అని నిర్మొగమాటంగా యెట్టయెదుట అనేవారు వుండనేవుండరుకదా? “యిద్దఱూ ముసలవాళ్ళే వీరికెందుకు? యీవాదాలు” అని మాత్రం అంటారు, ముసలవాళ్ల మవడంచేతే యీ వాదాలు. నేఁడో రేపో జీవితం అంతరిస్తుంది.

వెంకటశాస్త్రి మాఘం దాకా చదువుకొని మేఘసందేశందాఁకానే చదువుకున్నానన్నాట్ట అంటే అది నాకు కళంకంగాదా? “సంభావితస్యచాకీర్తిర్మరణా దతిరిచ్యతే" యీవొక్క అసత్యానికి వప్పుకుంటే కాజులూరు, చామర్లకోట, పిల్లంక, పల్లెపాలెం యిన్నివూళ్లల్లో చదువుకు అభావం చెప్పాలి. కృతఘ్నుఁడు కావాలి. దీనికి భగవంతుఁడు సహిస్తాఁడా? హైదరాబాదుకు యీ వుత్తరం వ్రాయడం దగ్గరనుంచిన్నీ గురువుగారి లేఖిని ఋజుమార్గంలో లేశమున్నూ నడవడమేలేదు. యీహానికేమోగాని వారు వ్రాసే మాటలు పరానికి పూర్తిగా విరోధించేవే. మన ఆర్యులకు యిహం కన్న పరం చాలా ముఖ్యం. యేలాగో యిహంలో లోకులని వంచిస్తే ప్రయోజనం లేదు అనేభయం మనవాళ్లకున్నట్లు వాళ్ల వాళ్ల ప్రవర్తనలు చెపుతాయి. వకదానిలోనుంచి వకదానిలోకి దూఁకడమే కాని గురువుగారి లేఖిని ప్రధానాన్ని స్పృశించడం లేదు. నా పేరెత్తి పలువురు గురువుల బిరుద ధారణాదులను ఖండించడం ఎప్పుడు మొదలెట్టారో అప్పటి నుంచిన్నీ నా మీఁద వారికి ఆగ్రహం అంకురించింది. పోనీ వారి కెవరికేనా నా ప్రేరణ వుంది అని అంటారేమో? అంటే, యెన్నెన్నో కాలాలు వ్రాసినా యిప్పటికి ఆ మాట మాత్రం వ్రాయలేదు గురువుగారు. యిది చాలా ప్రశంసనీయం. ఆత్మోత్కర్ష మాటలేమో నేను వ్రాశానంటారు గురువులు. నేనేకాదు అందఱూ పని పడ్డప్పుడు అంతో యింతో అట్టిమాటలు వ్రాస్తే వారే. గురువులున్నూ వ్రాశారు. యెందుకీ అప్రస్తుత విషయం? నాకు “ఫోటో" ల యందేమో ఆదరముందంటారు. యిదిన్నీ అప్రస్తుతమే. నిజం చెపుతాను. నాకు “ఫోటో" తీయించుకోవడానికి కూచోవడమంటే ప్రాణ సంకటం, ఆయా ఫోటోలలో వుండే నా యేబ్రాసి వేషం వల్ల చదువరులీ రహస్యాన్ని గ్రహించవచ్చును. శ్రీ గురువుగారి "పెండెరపు" సభకు అధ్యక్షుఁడుగా కూర్చున్న నన్ను శ్రీ న్యాయపతి సుబ్బారావు పంతులుగారు కొల్లాయి గుడ్డేదండోయి అని ప్రేమపూర్వకంగానే అనుకోండి. ప్రశ్నించి బహూకరించారు. విన్నారు శ్రీ గురువుగారు కూడా పంతుల వారివాక్యాన్ని వారి కప్పుడు గురువుగారిని చూపియేవో రెండు పొడి మాటలు మనవి చేసుకున్నాను. బహుశః దీన్నే గురువుగారు పెండెరపు సభలో వెం|| శాII తమ్ము అవమానించే చేష్టలు చేసినట్లు గూఢంగా వ్రాస్తూ వున్నారనుకుంటాను. ఆ