పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/805

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పనిలేనిపాట

909


కాపీ సంపాదింపఁ గలిగితిని. గురువుగారి విషయమై నాకింత వఱకును ఏమీ తెలియదు. నాకొక్కటియే తెలిసి యుండెను. కవిత్రయమువారు వ్రాసిన భారతమును గూడ వీరు తిరిగి వ్రాయ సంకల్పించి కృతార్థు లయిరనియు, కవిసార్వభౌములని బిరుదువడసి, కనకాభిషేకము చేయించుకోగలిగి మీ చేతి మీదుగనే గండపెండేరము ధరింప గలిగినారని మాత్రమే యెరిగియుంటిని. కృష్ణాపత్రిక మొదలగు పత్రికలలోని విమర్శనల నెరిగి యున్నప్పటికిని 1860-70 ఆ పది సంllరముల ప్రాంతములలో మన ఆంధ్రదేశములో పుట్టిన మహాపురుషులలో వీరుగూడ నొకరని అప్పటికి యిప్పటికి గూడ నాకు వీరియందు భక్తి గౌరవములుమెండు. కాని "శృంఖల" ధోరణి నాకాశ్చర్యము కలిగించినది. ప్రతి మానవునికిని యేదో వక లోపముంటుంది. కాని అంతటి ధీశాలి నీచమార్గమును బట్టుట..." ఇత్యాదులు. వారిని నిందించవలసినదానికన్న వారి యీలోపముకు విచారపడవలసి మాత్రముంటుంది. ఒకటి మాత్రము నాకు గట్టిగా తోస్తుంది. భారతాది మహాగ్రంథములతో సహా 108 గ్రంథములు వ్రాసి పారవేసిన కవిరాక్షసుని కీర్తి ఒక రాశిగను, శృంఖలాది గ్రంథములు వ్రాసిన అపకీర్తి ఒకరాశిగను, వీరి జీవిత చరిత్రయందు శాశ్వతముగ నిలిచిపోవుననియే. మాటకు సూటిలేనివారితో వాద వివాదములకు దిగుటకూడ ప్రమాదమేమో? ప్రతి వారూ 'మొదటి నుండి ఆయన దదేరకం, మీరుకూడా (మిమ్ముల) యీలాంటి వ్రాతలకు దిగడం యేమీ బాగులే' దనే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారుకాని, నిజమే వచ్చిన అపవాదను పాపుకోవడానికి ప్రయత్నించకపోతే యేలాగ! అనేవారు. కేవలము మిమ్ము గురువులుగనే కాక తండ్రికన్నను నెక్కువ గౌరవముతో పూజించుకొను సోదరబృందమే అంటున్నారు, ఎందుకొచ్చిన శ్రమ. కీర్తియో? అపకీర్తియో? ఆచంద్రార్కము నిలిచిపోగల ఖ్యాతిగడించి అయిపోయినది. ఇప్పుడెవరేమన్నను ఆ ఖ్యాతి తరగదు. పెరుగదు కూడా. కాకపోతే ఒకటి మాత్రం గట్టి, గురువుగారెంత ఛాందసులైనా అగుదురని నిర్ణయించుటకీ వాదప్రతివాదము లక్కఱకు వచ్చునేమో? దానికికూడ మీరు చింతపడవలసిన విషయమే యుద్ధరంగమునకు సూత్రము దిగిన తరువాత మంచిచెడ్డలు మాత్రము తోచవు. చూడండి మీరొక వ్యాసమున గురువుగారి పద్యముల పేలవమును చూపితిరి. ఈ సంగతి మీరు చూపకపోతే లోకమాపాటి గ్రహించుకోదనేనా! మీ అభిప్రాయము. ఆ భారమంతా లోకమే నెత్తిమీఁద వేసికొని ధరించును. ఏవో యిరవైవేల పద్యాలను గణబద్ధంచేసి పారవేసినంత మాత్రాన కవి సార్వభౌము లవుదురా? వీరే కవిసార్వభౌములైన వేంకటశాస్త్రిగారు మొదలగువారి సంగతేమిటి?, అని కృష్ణాపత్రిక వారు వ్రాశారంటే మీరు సూచించితేనేనా? వారు వ్రాసింది. రెండు సేలువుగుడ్డలుచూచి భ్రమించారని గురువుగారు వ్రాస్తే, మీరు సభలలో పొందిన గౌరవములు ఏనుగంబారీ