పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/801

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

905పనిలేనిపాట

(5-5-1936 సం||ర ప్రజాసేవ నుండి)

గురువుగారు వ్రాసేవ్రాఁతను గూర్చికాదుగాని నేను యిదివఱకు వ్రాసినదాన్ని గుఱించీ కాదుగాని యిప్పుడు వ్రాసే వ్రాఁతను గూర్చి ప్రాజ్ఞులు “పనిలేనిపాట" అని అనక మానరని యెఱుఁగుదును. కృష్ణ యెడిటోరియల్లో పనిగట్టుకొని, "అయుక్తంగా వుంది ప్రతివాద" మని తెల్పి నిరాకరించి వుండె. పలువురు వుత్తరాలు వ్రాస్తూన్నారాయె, అట్టి సందర్భంలో యేమిబాముకోవాలని గురువుగారి విపుల వ్యాసాలకు జవాబు నేను వ్రాయాలి? పైఁగా గురువులవా రాపాదించిన “కృతఘ్నత్వాన్ని" నిజం తెలిపి పోఁగొట్టుకుందామని వ్రాఁత మొదలెట్టి మృదువుతప్పకుండా మూఁడు వ్యాసాలు వ్రాసుకుంటే, దానిమీఁద కోపం వచ్చి గురువుగారు యిహపరాలు. లేశమున్నూ చూడక “గురుతల్పము, దొంగతనము" వకటేమిటి? రెండేమిటి? ముఫ్ఫైరెండు దాఁకా దోషాలు ఆపాదించి కృతార్థులైనారు గదా?

“సోలెఁడు బియ్యానికి సోదెకెడితే కుంచెఁడు బియ్యం కుక్క ముట్టుకుపోవడం” కాక మరేమి? యిది, ముల్లువుచ్చి కొఱ్ఱడచిన చందమైనదనిన్నీ అనుకోవడానికి పూర్తిగా వీలు లేదు. సుమారు యిరవై ముప్పయి కాలాల వ్రాఁతప్రవాహంలో కృతఘ్నత్వాన్ని నివర్తించే అక్షరాలున్నాయే అనుకుందాం. అవి బాగా బోధపడతాయా లోకానికి? అందుచేత యెందుకు ప్రారంభించానో ఆపనిన్నీ జరిగినట్లు లేదు. పైఁగా ఆ కృతఘ్నత్వాన్ని తలదన్నేవి ఆపాదించి వున్నారు గురువుగారు. లోకం ఆ వ్రాఁతచూచి వారి యెదుటనే యేవగించు కున్నట్టుకూడా విన్నాను. యెంత సత్యమో! యెవరిక్కావాలి! నిర్మొగమాటంగా మాట్లాడే వారు యీ కాలం లోనేకాదు, యేకాలంలోనున్నూ అరుదే. మా గురుశిష్యవాదాలని, కృష్ణ భరించలేక పోయింది. గోదావరి వొడ్డునవున్న "సుధర్మ" కూడా జంకి నట్లే వింటాను. పెన్న వొడ్డునవున్న “ప్రజాసేవ" నేనున్నానని పూనింది. ఆపెమాత్రం యెందాఁకా వోరిమిపడుతుందో? చూడాలి. తలా, తోఁకా వున్నవాదమైతే గదా? యిది. కవిత్వం చెప్పి, కన్యకనుకని, వంటవండి, సంగీతం పాడి, మెప్పుపొందాలంటే భారం లోకానికి వదలిపెట్టక తప్పదు. అందులో ముఖ్యంగా రసారస విచారానికి గ్రంథకర్త చెప్పే జవాబు పనికిరాదు. శబ్దసాధుత్వాదులకైతే గ్రంథకర్త పరిశ్రమ పనికివస్తుంది. కర్మంచాలక