పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


అవకాశమే కనపడడంలేదు, సుమారు 40 యేళ్లనాండు గద్వాలనుంచి వస్తూ గుంతకల్లు స్టేషనులో హోటలు భోజనం చేయవలసి వచ్చింది. తీరా భోంచేసేవేళకు- యజమాని నపడి మమ్మల్ని ఎంతో ప్రత్యుత్థానం చేసేటప్పటికి హోటలుకీపరేమిటి? యీ ప్రత్యుత్థాన వాక్యాలేమిటి? పైCగా యీ బ్రాహ్మడి తేజస్సు హోటలు పెట్టుకోవడానికి తగ్గదిగా లేదనుకొని కొంచెం కదిలించి చూస్తిమి గదా! ఆయనకు వేదం అశీతిద్వయమున్నూ చకంగా వచ్చును. ఇట్టి శుద్ధశ్రోత్రియుండికి యీగతి పట్టడానికి కారణమేమిటో? అని ఆట్టే విచారిస్తే అనారోగ్య హేతువును బట్టి విధిలెక జీవనార్థం యీ అకార్యంచేస్తూ వున్నానని విచారిస్తూ ఆయనే చెప్పారు: యెందటో దాక్షిణాత్యులు యింగ్లీషులో పెద్ద పెద్ద పరీక్షలు ప్యాసంుకూడా Ο ΧJo హోటలువృత్తిని అవలంబించి గొప్పగొప్పస్థితులు సంపాదించి గౌరవజీవనం చేస్తూవున్నట్టు కనపడుతుంది. "శ్లో అట్టశూలాజనాపదాః. అట్ట మన్నమితి ప్రోక్తంశూలో విక్రయ ఉచ్యతే" అంటూ విష్ణుపురాణాదులలో ΟΟΟΟ అవస్థ భవిష్యత్కాలంలో కలుగుతుందని వ్రాయడమున్నూ తుదకది ప్రత్యక్షం కావడమున్నూ చూస్తే ఆ ఋషుల దీర్ఘదర్శిత్వం అవగతమవుతుంది. చెప్పొచ్చే దేమిటంటే? పూర్వరీతిగా దుబారా ಭರಿುುಲು లేకుండా మితంగా కాలక్షేపం చేదామని ఏగృహస్టేనా ప్రయత్నించినప్పటికీ 89OOՄo హోటళ్లు బీడిసిగరెట్లతోపాటు సర్వత్రా అలుముకున్నాయి. గాంధీగారు జీవితచరిత్రలో వ్రాసుకొన్నట్టు కొందఱు యీ సిగరెట్లు కొనుక్కోవడానికి శక్తిలేక చిలకకొట్లద్వారా తమ వ్యామోహాన్ని తీర్చుకొనేవాళ్లున్నూ- కనపడతారు. యీ దురవస్థ తల్చుకుంటే దుర్వ్యసనం యేలాటి అకార్యాలు చేయిస్తుందో స్పష్టపడుతుంది-వాళ్లమాట యేలావున్నా కాస్త గౌరవంగామప్పితంగా కాలక్షేపం చేదామన్న - గృహస్తుకు - యివన్నీ యీతిబాధలు ਨੀ కనపడుతున్నాయి. నా చిన్నతనంలో తోడి బ్రాహ్మణ పిల్లలతోపాటు నేను డబ్బుకూ దసానికీ సంభావనకి వెళ్లకపోయేటప్పటికి మా తల్లిదండ్రులు “నీకు ముందుముందేలా గడుస్తుంది. యెక్కడికీ వెళ్లవనేవారు. దానికి “నాకేం నెలకు పదిరూపాయిలు యిప్పడు చదువుకున్న చదువుకే యిస్తారని గర్వంతో జవాబు చెప్పేవాణ్ణి. అప్పటికి నా చదువు "తెలుంగుస్కూల్లో లోవర్ప్రైమరీ సర్టిఫికట్టు" కలిగివుంది. ఆ కాలంలో ఆ మాత్రం చదువున్నూ అక్కఱ లేకుండానే యినస్పెక్టర్లు స్కూలు మాస్టరీ యిస్తూండేవారు. అట్టి స్థితిలో నేను పల్లెటూరి మాస్టరీకే వెళ్లవలసివస్తే యిన స్పెక్టర్లు నన్నెంత ప్రేమిస్తారో ఆలోచించండి. యేంకర్మమో? కాని అప్పుడు వంటబ్రాహ్మలు స్కూలుమాస్టర్లుగా వుండే స్కూళ్లల్లో చదివికూడా బాలురు మంచి భాషాజ్ఞానం కలవాళ్లుగా వుండేవారు. యిప్పుడు మంచి మంచి పరీక్షలిచ్చినవాళ్లు మాస్టర్లుగావుండే స్కూళ్లలో చదివికూడా ప్రధాన పదార్థం సర్వ శూన్యంగానే కనపడుతుంది.