పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/797

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మవంచన

901


కాని దిక్కుమాలిన ధనం అది సంతృప్తి అంటూ ఎవ్వనికీ కలగనివ్వదు. యిది సర్వానుభవసిద్ధం కనక విస్తరింప నక్కఱలేదు.

“ప్రాయోధనవతా మేవధనే తృష్ణా గరీయసీ" అన్నారు పెద్దలు. ధనవంతులకు ధనమందున్నదంత ఆశ దరిద్రులకుండదు. దీనికెన్నో వుదాహరణాలు చూపవచ్చును. అందఱికీ తెలిసిన విషయానికి వుదాహరణాలు చూపి కథ పెంచడమెందుకు? మన తహశ్శీల్దాగారుగారు అప్పటికే రెండు లక్షలకు అధికార్లయివుండి నెలకు రెండో మూడో వందలు జీతం తీసుకుంటూవుండి యింకా రైతులు మొదలైనవారు యిచ్చే నేయి, పెరుఁగు, కూరలు, నారలు, వగయిరా సంపత్తికలిగి సుఖంగా కాలక్షేపం చేస్తూ అనుకున్నారుగదా మనం కొద్దిరోజుల్లో యీ వుద్యోగాన్నుండి తప్పుకోవలసివస్తుంది, చేయడానికి వోపిక వున్నప్పటికీ వయస్పతీతమవడం చేత పైవాళ్లు నిర్బంధించి సాఁగనంపుతారు. అప్పుడేదో కొంత "పెన్‌షన్" యిస్తారుకాని యిస్తేమాత్రం యీ మజా వస్తుంది కనకనా? అందుకే "అధికారాంతమునందుఁ జూడవలదా? ఆయయ్య సౌభాగ్యముల్" అన్నారు పెద్దలు. యింకా అధికారాంతమందు చాలా విశేషాలు వుంటాయంటారు, వాట్లను గూర్చి యెన్నోకథలు చెప్పుకోవడం నాకున్నూ తెలిసిందే. తెలియడానికేముంది. యిదివఱలో వుండే పలుకుబడి లేశమున్నూ వుండదు. యిది సర్వానుభవ సిద్ధమే. అట్టి స్థితిలో కూడా యిప్పటి వలెనే జరగాలంటే బాగా ధనం చేతులో వుండాలి. వుంది గదా కొంత నిలవ, అంటే, వుందే అనుకుందాం. “కూర్చుని తింటే గుళ్ళూ చెళ్ళూ ఆగవు” గదా? అని ఆలోచించి అధమం పదిలక్షలేనా ఉద్యోగం చాలించుకునేనాcటికి ధనం నిలవ వుండేటట్టు చేసుకోవాలి అని మనకథా నాయకుఁడుగారు సంకల్పించుకున్నారు. దానిమీఁద రాజకీయమైన ధనాన్ని అపహరిస్తే తప్ప లంచాలవల్లా గించాలవల్లా మనోరథం నెఱవేఱేటట్టు కనబడలేదు. అంతట్లో జమాబందీరోజులు వచ్చాయి. యేడెనిమిది లక్షల పయికం సర్కారుకు తాలూకానుండి జిల్లాకు పంపవలసి వచ్చింది. మనకలియుగ రావణాసురుఁడుగారు కొంతమంది దొంగలను తోవలో సిద్ధంచేశారు. వాళ్లు రాజకీయ భటులను చావందన్ని పైకం యావత్తూ దోఁచుకున్నారు. తహశ్శీల్దారుగారు దొంగల కేర్పాటు చేసిన ప్రకారం కూలియిచ్చి వేయడమే కాకుండా అదనంగా కూడా సంతోషపెట్టి యెక్కడో ఆపయికాన్ని భూస్థాపితంచేసి జరిగిన వుపద్రవాన్ని నేర్పుగా సర్కారుకు తెలియపఱచుకొన్నారు.

పై అధికార్లు వచ్చారు. విచారించారు. వాకపుచేశారు. పాపం దాఁగుతుందికనకనా యేదో కొంత వాసన కొట్టడం మొదలెట్టింది. అంతేకాకుండా మనం ఆత్మని యెంతవంచించి