పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొత్తరకం ఈతి బాధలు

83


తోస్తుంది- దీనితో కొన్ని పౌడర్లుకూడా చూచుకోవాలి. పూర్వం యీమాత్రం నాగరికత లేకపోలేదుగాని అది సార్వత్రికం కాదు- యీ పౌడరుకు బదులుగా లో ధ్రపుష్పచూర్ణాన్ని వాడేవారని- "నీతా లో ధ్రప్రసవరజసా పాండుతా మాననే శ్రీః" అనే మేఘసందేశంవల్ల తెలియవస్తుంది. ధనికుల కేవిన్నీ బాధించవుగాని సామాన్యగృహస్టులకు యివన్నీయితిబాధ తరగతిలోవే. అధమం నెలకు నూఱురూపాయీలేనా సంపాదించేవాఁడయితే తప్ప ఆయీ నాగరికతకు సంబంధించిన సామాన్య సంసారాన్ని యీందంజాలడు. మా చిన్నతనంలో నెలకు పదిరూపాయిలు తెచ్చుకునే గృహస్టుచకంగా సంసారాన్ని యీcదుకోcగలగడమే కాకుండా పైంగా అతిథి అభ్యాగతులనుకూడా శక్తికొలందిని ఆదరించేవాండు. యిప్పడు నూఱురూపాయిల జీతగాఁడు పిడికెండుబియ్యం ముష్టికూడా పెట్టలేకపోతూ వున్నాండు. అప్పడు యీ కాలంలోవుండే దుబారాఖర్చులు యేవీలేవు సరిగదా! ధాన్యాదుల వెలలు చాలాతక్కువలో వుండేవి. నా స్వానుభవవిషయం వకటి వ్రాస్తూవున్నాను. నేను 1903లో బందరు హైస్కూలులో తెలుంగు పండితుండుగా రు 25-0-0 రూపాయిల జీతంమీంద హఠాత్తుగా ప్రవేశించాను. అప్పటికి నాకు రూపాయి వడ్డీమీంద రు.600-0-0ల రూపాయిలు అప్పవుంది. అప్ప మాన్యంమీంద వచ్చే రు. 100–0–0 శిస్తువల్లను శ్రీనూజివీటి రామచంద్రాప్పరావుగారు ప్రతియేంటా వెళ్లినా వెళ్లకపోయినా తప్పకుండా యిచ్చే నూటపదహార్ల వార్షికంమీందనూ తీరుతుంది గదా అనిన్నీ రు.25-0–0 ల జీతంతో పట్నవాసంలో నేనూ భార్యా యెవరో తోవాసం వకపిల్లవాఁడున్నూ మొత్తం ముగ్గురువుండే నా కుటుంబమున్నూ, యింటివద్ద మాతల్లిదండ్రులూ, యెల్లప్పడూ తఱచుగా యా ఇంటనే వుండే యిద్దఱు తోCబుట్టువులూ, వాళ్లపిల్లలూవుండే పెద్ద కుటుంబమున్నూ యేలోపమూ లేకుండా చకంగా జరిగేది. దీనిక్కారణం ముఖ్యమైన ఆహారపదార్థాలు. ఆముదందీపాలు, యెప్పడో అవసరమైతే నాకవిత్వ రచనకు మాత్రం కొవ్వొత్తిదీపం, దొడ్లో ఆకూ కూరా వగయిరాలతో యింట్లోవున్న పాండితో సంసారం నడుపుకోవడమే. యిప్పడో ఈ రెండు కుటుంబాలకున్నూ, రు. 25-0-0 రూపాయిలు కాఫీ -టీ -సిగరెట్లకుకూడా సరిపోవనుకోవాలి. యీ వాతావరణం పూర్తిగా వేళ్లు నాటుకుపోయింది. ప్రతి పల్లెటూల్లోకూడా కాఫీహోటళ్లు వెలిశాయి. కాఫీహోటళ్లంటే జ్ఞాపకం వచ్చింది. ఆమధ్య వక సంవత్సరంకింద వక అతిథి, మా యింటికి వచ్చాండు. ఆయన మైసూరు ప్రాంతం వాణ్ణని చెప్పాండు. యేంపనిమీంద యీదేశం వచ్చావని అడిగాను. “కాఫీ హోటలు పెట్టుకోవడానికి ఏదేనా వూరు వెదుక్కొవడానికని బయలుదేలాను. యొక్కడా కాళీగావున్న పల్లెటూరు దొరకలేదన్నాండు. యీ హోటలుగాని అన్నంపెట్టే హోటలుగాని పెట్టుకోవడం మన ఆంధ్రులకు పూర్వం చాలా నీచంగా వుండేది; ఇప్పడు దీన్ని అవలంబిద్దామన్నా