పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/789

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దోషావాచ్యా గురోరపి

893


మేమిద్దఱమూ యేకమై కట్టుదిట్టంగా పనిచేసినా అసలు విషయం తప్పైనప్పుడు దాన్ని లోకం గ్రహించలేకపోతుందా? నేను శిష్యుణ్ణికనక నెపపెడుతూ వున్నారు గురువుగారు. లోకైక విద్వాంసులగు శ్రీశ్రీపాద లక్ష్మీనరసింహశాస్త్రులుగారు మా గురువుగారికి “అస్మద్గోత్రంవర్థతాం” అనే తెగలోవారేకదా? వారు మాత్రం గురువుగారి తోవను సమర్థించడానికి పూనుకున్నారా? యెవ్వరూ బొత్తిగా అయుక్తంగా వున్నదాన్ని సమర్ధించలేరు. కొందఱు ఆలాటి విషయాల్లో మనకెందుకని వూరుకొంటారు. నేనాలా చేస్తే బాగుండేదేకాని నాతత్త్వం ఆలాంటిదికాదు. ఆవలివారికి జవాబు చెప్పలేక పోయినప్పుడు వారిమతంలో చేరిపోవడమే నాతత్త్వం. అందుచే అభిప్రాయం యిచ్చాను. అందులో “తగల బెట్టుకొమ్ము, బూడిదకలవాడవవుతావు” అన్నమాటలు నన్ను పూర్తిగా బాధించాయి. యిప్పటికీ బాధిస్తూన్నాయి, తగలబెట్టుకొమ్మనడం మొదటి తరగతిదోషం, అశుద్ధం, అమంగళం, రెండో తరగతిలో చేరుతాయి. ఆ శ్లోకాలు చెప్పిన పండితుఁడేమీ లాకలూకాయ కాఁడు. పెద్ద తర్కవిద్వాంసుఁడు. వీరి ఆక్షేపణలకు జవాబువ్రాసి పండితుల అభిప్రాయాలు పుచ్చుకొని అచ్చొత్తించి "వట్టి వ్రాఁతలెందుకు శక్తివుంటే సభకు రావలసింది" అని గురువుగారిని ప్రార్ధించివున్నాఁడు. వీరందుకు పూనుకొన్నట్లు లేదు. అది ఆలా వుంచుదాం తగలబెట్టుకొమ్మనడమున్నూ, శ్లేషగా అశుద్ధమనడమున్నూ అమంగళ మనడమూన్నూ పండితులకే కాదు మానవమాత్రులందఱికీ హేయంగానే వుంటుందని నా విశ్వాసం. దీన్నింకా సమర్థించే “శృంఖల" గ్రంథాన్ని నాలుగుమూఁడేళ్లు ఆపడమేకాక కొందఱు పెద్దమనుష్యులతో తగలఁబెట్టి నట్లుకూడా స్వయంగా చెప్పియున్నప్పుడేమో నన్ను జయించడానికి అచ్చు వేస్తారట! మార్చితే తప్ప నాకు దొరకిన ప్రతే అయితే అది వారికి అవమానాన్ని తెచ్చి తీరుతుంది. విశ్వకర్మ శిష్యుఁడుగారిచేత అబద్ధాలాడించడం మొదలు పెట్టేరు. సుబ్బారావుగారితో ముక్త్యాల విషయమేమీ విశ్వబ్రహ్మంగారు ప్రసంగించనట్టే యిప్పుడు "సుధర్మ" లో వ్రాయిస్తూవున్నారు. యేపత్రికలోనూ ప్రకటన అప్పటికి లేశమున్నూకాని నాముక్త్యాల విషయం బ్రహ్మంగారు అప్పటి ప్రసంగంలో తేకనే పోతే ఆ సుబ్బారావుగారికేలా తెలుస్తుంది? చదువరు లూహించుకోరా? యేదో వారికీ వీరికీ ప్రసంగం వచ్చింది. దానిలో వెంll శాII గారు చాలా గొప్పవారు. వారేమిటి కృష్ణమూర్తిశాస్త్రులుగారికి శిష్యులేమిటి అని సుబ్బారావుగారు నాయందు అభిమానంచేత అనివుండాలి. దానిమీఁద బ్రహ్మంగారు గురువుగారివల్ల విన్న సంగతులను మఱింత రసపోషణచేసి యేకరు పెట్టివుండాలి. యీయన బొత్తిగా ముక్త్యాలవిషయాన్నే సృశింపకపోతే ఆయనకు తెలియడానికి అవకాశం లేదు చూడండి యీ ప్రసంగానికి శృంఖలంలో గురువుగారు వెళ్లిన వాక్య ధోరణి తోడ్పడుతూవుంది. అంతేనేకాని, “నేను