పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/788

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

892

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


శ్లోకపంచక నిరాకరణం. వారికి అంటే యెవరికి నాకు అనగా వేంకటశాస్త్రికి. సరే. అప్పుడు తెరచాటుంది కనుక కొంచెము సందేహించడానికి కవకాశముందిగాని యిప్పుడది లేదు గనుక పూర్తిగా గురువుగారివే ఆ తిట్లు అని తెలిసికొన్నాను. గురువుగారు వ్రాస్తారుకదా! "మా యిరువురకున్న సంబంధముచే నా వ్రాఁతలలో తప్పులున్నను సమర్ధించి వ్రాయుట తమకు విధియైయుండ" అని నన్ను నెపపెడతారు. యిదివరలో నాశిష్యత్వాన్ని హేయంగా తలఁచినా దీనికోసం అంగీకరించారు. ధన్యుణ్ణి. సామాన్యపు తప్పులైతే చూచుకోవచ్చు, వ్యాకరణ సంబంధమైతే యేలాగో బ్రహ్మయ్యశాస్త్రులవారి శుశ్రూష నుపయోగించి కొంత పెనుగులాడతానే అనుకోండి, యీ తప్పులాలాటివికావుగదా! పెండ్లి కొడుకును ఆశీర్వదించిన పద్యాలాయె-పద్యాలు-చెప్పిన-పండితుఁడు-తమకు ద్వేషికాని ఆ యువరాజుగారు ద్వేషికాడాయె. “యినుమునుబట్టి అగ్గికి సమ్మెటచెబ్బలు" అన్నట్లు ఆయనక్కూడా బాధ కలుగుతూ వుందాయె. ఒకవేళ గురువుగారిక్కోపం వస్తుందని నా ఆత్మను నేను వంచించికొని మా గురువుగారి ప్రవృత్తి సమంజసమే కనుక నేను మీ కభిప్రాయం యిచ్చేది లేదు. అంటానే అనుకోండి దానిమీఁద ఆపండితుఁడు మీకేలాతోస్తే ఆలాగే యివ్వండి అంటాఁడు కదా? దాని మీఁద ఆలాగే యిచ్చి నేను కూడా లోకుల నిందకు గురికావలసిందేనా! ఆ కారణంచేత నాకు తోచిన అభిప్రాయాన్ని నేను వ్రాసియిచ్చాను. దానిమీఁద గురువుగారికి కోపంవచ్చింది. ఆ కోపం అనేక మార్పులు పొంది అనేక వ్రాతలు వ్రాయిస్తూ ఉంది. దీన్ని సహించగలను గాని లోకనిందను సహించఁగలనా? యితర జమీందార్లతోపాటు నాకు కొల్లాపురం వారితో లేశమున్నూ సంబంధములేదు గాని వుండేటట్టయితే ఆ జమీందార్లే నన్ను అన్యథాగా అభిప్రాయమిచ్చే యెడల నిరోధించి అడిగే యెడల "మెమ్మేతెత్తే" అనవలసిందేకాని నోరు విప్పఁగలనా? గురువుగారు సులువుగా వ్రాసేమాట కనక "సమర్ధించవలసిం" దని వ్రాస్తూన్నారు. నా శక్తి నేను చూచుకోవద్దా? వారు మఱికొందఱితో వాదోపవాదాలు పెట్టుకొన్నప్పుడు ప్రమాదపడిన విషయాలలో ఆ పండితులు నాకుత్తరం వ్రాస్తే గురువు గారికి చిక్కువస్తుందని ఆవలివారిని బతిమాలుకొని తప్పుకొన్నవిన్నీ కలవు. అందొకటి చూపుతాను. గురువుగారు శ్రీ శిష్ట్లా నరసింహశాస్త్రులవారి మేఘసందేశాన్ని సుధీమణిగారిని కవచంగా పెట్టుకొని ఆక్షేపించినవాటిలో “ఫణిప, కణప" అనే శబ్దాలను రెండింటిన్నీ తప్పన్నారు. ఆ శాస్త్రులు గారో? వారి కుమారుcడో "ఫణిపయితాహే, కణపయితాహే” అని వక పెద్ద మహాపండిత కవిశేఖరుఁడి ప్రయోగాన్ని యిచ్చి, ఆ యీవిషయాలుగల వాగ్బంధం అనే పుస్తకాన్ని అభిప్రాయార్థం నా దగ్గఱకు పంపేరు. యివ్వక యేదోవిధంగా తప్పుకొన్నాను. యిస్తే యింత కాకపోయినా అదిన్నీ యెంతదాకానో మునిఁగేదే? యెంతగా గురుశిష్యులం _