పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/785

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



889


దోషావాచ్యా గురోరపి

(18-3–1936 సుధర్మ పత్రిక నుండి)

అనడం వల్ల గురువులది యేదేనా శబ్దమో అర్థమో తప్పుగా వున్న యెడల దాన్ని శిష్యుఁడికి తప్పనడాని కధికారం వున్నట్టు మనపూర్వులే అంగీకరించారు. అంతేకాని గురువుగారికి తప్పని తెలిసికూడా వొప్పే అని వాదించవలసిందని విధివాక్యం యేదీవున్నట్టు లేదు. అయితే గురువుగారు మాత్రం వారిది తప్పయినను నేను సమర్థించడం విధి అని రెండుమూడు సార్లు వ్రాసి వున్నారు. “చెరలాటంలో” అలా చేయక పోవడంచేత దుర్మార్గుఁడు, అని కూడా తేల్చారు. యింకొక చిత్రం “ఓగిరాల సుబ్బారావుగారి జోడు సేలువులు చేతికఱ్ఱ యిట్లు వ్రాయించినవి." అంటూ వక వాక్యం వ్రాశారు. యిది యేసందర్భంలో అనుకున్నారు. వారి ప్రతికక్షికి నేనిచ్చిన సదభిప్రాయాన్ని గుఱించి కోపించే ఘట్టంలో, సదభిప్రాయ మిచ్చిందెప్పుడు? 24-7-30 సం|| తేదీని. గురువుగారు వ్రాసే సేలువుల గొడవ 1935 సం|| నవంబరులోది. అనఁగా నిన్న మొన్నటిది. అప్పుడేదో అనఁగా విశ్వకర్మ శిష్యుడుగారి ప్రసంగ సందర్భంలో ఒక వుత్తరం నా పేర ఆయన అంటే సుబ్బారావుగారు వ్రాశారు. నేను శ్రీవారి వద్ద చదివినవాఁడనే అని జవాబు వ్రాశాను. యీ ప్రసక్తి 1932 సం|| సెప్టెంబరు ప్రాంతములోనిది. అంతే ఇటీవల ఆయనకున్నూ నాకున్నూ ప్రసక్తి లేదు. యింతలో నిన్న మొన్న దీపావళిముందు మా రెండవ చిరంజీవి హైదరాబాదుకు అవధానానికంటూ వెళ్ళేడు. అక్కడే వో కొన్ని సభలు జరిగాయి. అందులో కొందఱు ప్రముఖులు తండ్రిగారిని కూడా పిలిపిస్తే బాగుంటుందనుకొని నా పేర వ్రాశారు. నా అసమర్ధత్వాన్ని నేను తెలుపుడు చేసి వూరుకున్నాను. అప్పుడేమో ఆసభలో నా ప్రతిమకు ముందుగా సేలువలు చేతికఱ్ఱ యిచ్చి ధూపదీపనైవేద్యాల మర్యాద జరిపేరట ! అదుగోఁ ఆ సేలువలు గురువుగారికి వ్యతిరేకంగా నేను 1930వ సం||రంలో యిచ్చివున్న అభిప్రాయానీకి కారణమయినాయఁట! యెంత సందర్భశుద్ధిగావుందో చూడండి. వనంవారు కొల్లాపురానికి తీసుకువెళ్లి వేయినూటపదహారు లిప్పిస్తా మనడంచేత అట్టి అభిప్రాయాన్ని నేనిచ్చినట్లు "శృంఖలం"లో వ్రాశారు. అబద్ధమైనా అది కొంత అతికినట్లుంది. యిదేమిటి? ప్రస్తుతానికి వద్దాం. యిలా విరోధాలు చూపడానికి మొదలెడితే యెంతేనా పెరుగుతుంది. గురువుగారు కృష్ణలో వ్రాస్తూ వుంటేమీరు సుధర్మకు పంపేరేమిటి! సుధర్మలో శిష్యుడు