పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/783

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



887



వకటేమాట లేక సూక్ష్మోపాయం

(14-3–1936 సం||ర కృష్ణాపత్రిక నుండి)

గురువుగా రేదో వ్రాస్తూవున్నారు. ప్రధానాంశం మాత్రం తేలడం లేదు. వ్రాఁత పెరిఁగిపోతూవుంది. వెం||శా|| కృతఘ్నుఁడు అని తేలినట్లులేదు. వ్రాఁత పెరిఁగిపోతూ వుండడం చేత పరస్పరవిరోధాలు మిక్కిలిగా దొర్లుతూన్నాయి. ఆ విరోధాలను బట్టి వారు అసత్యకల్పనకు దిగినట్లు లోకులు భావించడాని కవకాశం కలగడం తప్పుకాదు. యిదే అవకాశం గదా అని యెవరో గొప్ప సభ్యులు లేచి మా గురుశిష్యు లిద్దఱినీ తూలనాడుతూ తమ సభ్యత్వాన్ని ప్రకటించుకొంటూ అంతతో తృప్తిపడక "మొఱ్ఱో వెంకటశాస్త్రి శిష్యత్వం నాకువ" ధ్ధని కంఠోక్తిగా వ్రాస్తూవున్న గురువుగారిని ఇందుకోసం “పాట్లుపడుతున్నారు" అని వ్రాసివున్నారు. యింకా యీ సభ్యులు వ్రాసిన ప్రధానాంశంలో కూడా కొంత సాహసం కలదు. అవసరమైనప్పుడు వేఱొక విషయంలో చూపిన మఱికొంత సాహసాన్ని కూడా కల్పి దాన్ని ఋజువు చేస్తాను. ఆ “ప్రబుద్దాంధ్ర" దాచే వుంచినట్లు జ్ఞాపకం. మా వాదం పూర్వాచారానికి సంబంధించిందవడంచేత ఆ “ప్రబుద్దుల"కు తప్పుగా, అసభ్యంగా తోఁచడంలో ఆశ్చర్యంలేదు. - -

అది యట్లుండె యిఁక మా గురుశిష్యులవాదం తేలే వుపాయమేమిటి? కాలాలకి కాలాలు నిండిపోతూవుంది గదా! అంటే వక ఉపాయం తోఁచింది. దానికి గురువుగారే మార్గప్రదర్శకులు. యిది యేకతరద్వంద్వ యుద్ధం వంటిది. వుభయ సేనలలోనున్నూ కర్ణార్జునలవంటివారిని యిద్దఱిని యేరికొని పోట్లాడించి జయాపజయ నిర్ణయానికి వుభయులున్నూ అంగీకరించే ఆచారం పూర్వమందు వుండేదఁట. యిప్పుడు గురువుగారు సూచించినదిన్నీ అట్టిదే. దాన్ని చూపి మఱీ వ్రాస్తాను.

"నేను వారి విషయమై వ్రాసిన వ్రాతలంగూర్చి యేదియేనియు వారు కాదనగలిగినచో నొరుల సాక్ష్యముతో నవసరములేకుండ నేను చేసినది తప్పేయని యొప్పకొందును.”

పై సాహసోక్తి గురువుగారిది. దీన్ని భంగించే అంశాన్ని వుదాహరిస్తాను. యింతతోనేనా గురువుగారు విరమించి సాచీమార్గానికివస్తే సంతోషించి మిన్నకుందును. “పాఠక మహాశయులారా! నాకిప్పటికి 69 సం||రములు నిండినవి. నేనెప్పుడును