పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/782

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

886

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


క. “గురుబుణము తీరుటకు వ్యా
    కరణముచెప్పు" మని గురువుగారన్నది నే
    మఱవఁగలే దల ధవళే
    శ్వరమున బ్రహ్మగురుసేవ సలిపెడి పట్లన్.

అది యటులుండె, గురువుగారికి నాకన్న ప్రేమపాత్రుఁడులేఁడు ఇఁకముందున్నూ వుండఁబోఁడు. కాలకర్మ దోషంవల్ల నేను వారి ప్రతిపక్షికిచ్చిన అభిప్రాయంవల్ల వారి మనస్సు చెడినది. దానిపై నేదో వ్రాశారు. వ్రాసినా నేనెట్లో సరిపెట్టుకున్నాను. కొన్ని యేండ్లు జరిగి పోయాయి. అంతలో విశ్వకర్మ శిష్యుఁడు యీ చిక్కు తెచ్చిపెట్టేడు. అక్కడికి వ్రాసిన వత్తరం వల్ల యింత పెరిఁగింది. అయితే నేను వారిని వదలను, నన్ను వారున్నూ వదలరు. "విప్రుల యలకయు, తృణ హుతాశనమ్ము దీర్ఘమగునె?"


★ ★ ★