పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/775

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శాస్త్రిగారి "క్షమాపణ"

879


వోర్వలేమిగా భావిస్తారుకాని అంగీకరిస్తారా? నేను నా గ్రంథానికీ, నా చరిత్రకూ కల్గిన విరోధాన్ని నా జీవితకాలంలో సవరణ కావడం కొఱకు పత్రికలో యేవో వ్యాసాలు రాసుకుంటూవుంటే, అధికారం వున్నావారు కనుక “నవ్వుబాట్లపాలుగాకుము" అని హితబోధచేసి చేవ్రాలు చేస్తూ కష్టపడి సంపాదించుకొన్న బిరుదం వదలిపెట్టి ప్రత్యేకించి నాకోసం, ప్రియవాది అనే క్రొత్త బిరుదాన్ని ఉపయోగించారు. నేను కూడా ఈ బిరుదాన్నే ధరించి ప్రస్తుత మ్మీరు చేయఁదలఁచుకొన్న ప్రయత్నాన్ని గూర్చి నివారణమాటలు వ్రాస్తే తాము విశ్వసిస్తారా? విశ్వసింపరు. చూడండి శ్రీ వీరేశలింగంగారి కేదో శిలావిగ్రహాన్ని స్థాపించారఁట. కీ||శే|| డయిన ఆయన ప్రయత్నం వుందని అనుకుంటారేమో యెవరేనాను. అనుకోరుగదా? ఇంకొకటి. కీర్తిశేషుఁడైనప్పటికీ లోకానికి యీ సమ్మానానికి ఆవ్యక్తికి అర్హత లేదని తోస్తే వెక్కిరించడాన్ని యెవ్వరాపుతారు? "లోకులో కాకులో "వకవేళ “కాదన్నవాఁడు కరణం" అన్నట్టు ఆ కాస్త మర్యాదా జరిగిన తర్వాత, యెవరో బయలుదేరి సమర్థిస్తారనుకోండి. యేంలాభం? ఆలాటి త్రోవ వచ్చినప్పుడే "పంచశుభం, పంచాశుభం" అంటారు లోకులు. నేనొక బిరుదానికి ప్రయత్నించడం లేదు. శిలావిగ్రహస్థాపనకై ప్రయత్నించడం లేదు. నాకు జన్మదినోత్సవం చేస్తారా? చేయరా? అని యెవరినీ యాచించడం లేదు. నా జీవిత చరిత్రలో వ్రాసినవ్రాఁతకు బాధకలిగే వ్రాcత తమది అచ్చుపడివుండడం చేత ఆ తప్పును తొలఁగించుకోవడానికి ప్రయత్నించాను. దాన్ని మీరు నవ్వుబాట్ల పాలవడానికి ప్రయత్నించినట్లుగా వ్రాశారు. దాని మీఁద యింత వ్రాయవలసి వ్రాశాను. ఈ వ్రాఁత యథార్థమైనదయినా నా స్థానానికి అనఁగా శిష్యుడికి ఉచితం కాదుకాఁబట్టి మీ పాదాలమీఁద నా శిరస్సు వుంచి క్షమాపణ కోరుతూవున్నాను. దాసుడితప్పు దండంతో సరి. అనుగ్రహించండి. యిప్పటికి నాకు తమరు ఆపాదించిన కృతఘ్నత్వం వకటి నివర్తించినట్లయింది. కొంతమట్టుకు ధన్యుణ్ణయినాను.

యిఁక “దురుద్ధర దోషశృంఖలం" ద్వారాగా ఆపాదించిన దోషాలు రెండున్నాయి. అందులో వకటి ముక్త్యాలకు సంబంధించింది, రెండు పాలకొల్లుకు సంబంధించింది. ఆ “శృంఖలగ్రంథం" కూడా హైదరాబాదు వుత్తరంవలె ప్రమాదమూలకమే అంటే నాకు పూర్తిగా ధన్యత్వం కలుగుతుంది. లేదా? యీ కృతఘ్నత్వం పరలోకంలో విచారించే వాళ్లు సర్వజ్ఞులు కనుక నన్ను బాధించరుగాని యిహలోకంలో యెవళ్ళోతప్ప వాళ్లని పోలేవాళ్లుండరుకాcబట్టి నన్ను కొంతేనా బాధించకపోరు. అందుకోసమై నేనింతగా అభ్యర్థిస్తున్నాను. ఆయీ అభ్యర్ధనం న్యాయమైనప్పటికీ గురుశిష్యులకు కలహం పెరిఁగి పోతూ వుందని పత్రికవాళ్లు ప్రకటించక పోయినా నేను యిప్పుడు యే రోజుకు ఆరోజే వ్రాయుచున్న "ఇటీవలి చర్య"లో విస్తరించి వ్రాసివున్నాను. దాని ప్రకటనము కూడా