పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/774

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

878

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


15 - తాన్నాశః - 2 (2) రాజులేని అమెరికాదేశంలో కింగ్సుకు లెక్క లేదు. అయిల్ కింగు... మన ఆంధ్రభూమిలో, కింగ్సేమిటి? సార్వభౌములు, చక్రవర్తులూను - కవిసార్వభౌములు, శిల్పసార్వభౌములు, ... తామరతంపరగా పెరుగుతూన్నారు. పై సందర్భాలు కృష్ణాపత్రికలోవి. భారతిలో ఒకప్పుడు వ్రాశారుగదా : “ఈనిక్కపు కవిసార్వభౌమునకు" అని. దాని తాత్పర్యమేమిటో! నందిరాజు చలపతిరావుగారు కాశీమజిలీ అచ్చువేస్తూ ఆ పుస్తకం మీఁద - "నిజమైన కాశీమజిలీలు" అని పేరు వేయించారు. దానికర్థ మేమిటి? అంతకుపూర్వం యెవరో అచ్చు వేసిన కాశీమజిలీ లున్నట్లున్నూ అవి నిజమైనవి కానట్టున్నూ, తనవి నిజమైనట్లేకదా దాని తాత్పర్యం. ఆట్టే వ్యాఖ్యానమెందుకుగాని, (త్రిలింగలో కాcబోలును, శ్రీ వ.సు. రాయకవిగారికి జరిగిన రాజమండ్రి సమ్మానాన్ని తమకు జరిగిన పెండరపు టుత్సవం దరిమిలాను పనిలేనిపాటగా అభినందిస్తూ చంద్రాభట్ట రామమూర్తిగారు కాఁబోలును పద్యాలలో యేలావ్రాశారో తమరు చిత్తగించారా? వసురాయకవిగారు వారికి జరిగిన సమ్మానాన్ని గుఱించి యే వూరువెళ్లి యెవరినీ ఆశ్రయించలేదఁట, వారంతట వారే లోకులు ఆయనను ప్రేమించి ఆ సమ్మానాన్ని జరిగించేరఁట. దీని తాత్పర్యమేమిటో తాము పరిశీలించారా? ఇదే అర్థమిచ్చేటట్టుగా అభినవ సరస్వతీ పత్రికాధిపతి వక సీసగీతలో వ్రాశాడు చూడండి.

ఆ.వె. అడిగినారె మీరు యత్నించినారె స
       మాశ్రయించినారె యందుకొఱకు.

ఇది ఆయన యెవరిని గుఱించి వ్రాసినా, ఆ కాలమం దెవరో అడిగి, యత్నించి, ఆశ్రయించి, సమ్మానం పొందినవారిని మనస్సులో పెట్టుకొని వ్రాసినట్లేకదా? యింకా యిట్టివి పెక్కులున్నాయి. ఇవన్నీ తమ పెండరపు టుత్సవానికి యించుమించు కాలములోనివే. యివి వ్యంగ్య మర్యాదచే తెలుపుడు చేస్తున్నాయి ప్రస్తుతాంశాన్ని వాచ్యంగానే వ్రాసింది కృష్ణాపత్రిక సంపాదకీయంలో, సార్వభౌమ బిరుదాన్ని గూర్చిన్నీ కనకాభిషేకాన్ని గూర్చిన్నీ దాన్నే బలపరిచారు శిష్టావారున్నూ పరిమివారున్నూ, యిందులో యెవరున్నూ లాకలూకాయలుకారు. మీయం దేవ్వరికిన్నీ ద్వేషమున్నట్లాధారాలు లేవు, వీరి వ్రాఁతనే ఖండించడానికి అవకాశం లేదని నేను శాంతివ్యాసంలో వ్రాస్తే “అవివేకపు వ్రాఁతలకు నిరుత్తరమే సమాధానమనీ, నిరసించుటే ఖండన మనిన్నీ తమరు నా కళ్లనీళ్లు తుడిచి వోదార్చారు. కాని,నా మనస్సులో ఆ దుఃఖం అప్పటికీ యిప్పటికిన్నీ బాధిస్తూనే వుంది. ఉంటే మాత్రం యేంచేయను? తమతో మనవిచేసి యిఁకముందేనా యిట్టి ప్రయత్నాలు చేయకండి మహారాజా అని బతిమాలు కుందామంటే తాము దాన్ని