పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొత్తరకం ఈతి బాధలు

81


కొంచెం వెలమ జమీందారులలో కూడా యీ కాల్పు వుందని వినికి. విజయనగరం సంస్థానంలో యేడువందల బ్రాహ్మణా గ్రహారాలున్నట్టున్నూ శ్రీ ఆనందగజపతి మహారాజులుంగారి తండ్రో, లేక తాతగారో, ముత్తాతో వక పరియాయం ఆ అగ్రహారాలు చూడడానికి వెళ్లేటప్పటికి వేదశాస్త్రప్రచారం కలికంలోకి కూడా కనపడక యొక్కడచూచినా చుట్టకాల్పులున్నూ వీట్లకు సంబంధించిన పరికరాలున్నూ కనపడేటప్పటికి ఆయన చాలా నొచ్చుకొని– “అన్నా తుట్టతుదకు ఆలాటి వంశస్టులంతా యీ స్థితికి వచ్చారుగదా! అని చింతపడి దీనికి వుపాయం యేమిటని ఆలోచించి వెంటనే- “అగ్రహారాలన్నీ జప్తుచేశామని ప్రకటించేటప్పటికి యే కొంతమందో రాజుగారి దర్శనం చేసుకొని మనవి చేసుకోవడానికి అర్హతకల తలకాయలు అక్కడక్కడ విత్తనాలలాగ ఇంకా వున్నారు కనుక వారువచ్చి నెత్తీ నోరూ మొత్తుకుంటే మహారాజులుంగారు- "మీకు యీ అగ్రహారాలు యెందుకైతే పుట్టివున్నాయో 영9 స్థితిలో వుండేపర్యంతమున్నూ వక్క పైసాకూడా మీకు ముట్టదు. యీలోగా మేం వసూలుచేసి మంచిస్థితికి వచ్చినవెంటనే యావత్తున్నూ మీకు యిచ్చి వేస్తాము" అని శాసించేటప్పటికి "జహద్దేవరా” అని మళ్లా అగ్రహారాలవారందఱూ తల తడిమిచూచుకొని వేదశాస్తాలలో కృషిచేసినారనిన్నీ మహారాజులుంగారి మెప్పనుపొంది మళ్లా అగ్రహారాలు నిలబెట్టుకున్నారనిన్నీ వినడం. యిప్పుడు ఆలా శాసించి మనలని బాగుచేయడాని కెవరున్నారు? అన్నింటికీ కాంగ్రెస్సువారే కనపడతారు. వారు యెన్నిటికని కలగంజేసు కుంటారు పాపం! వొకజిల్లాలో మద్యపాన నిషేధానికి వుపక్రమిస్తే 24 లక్షలు బడ్జెట్టులో లోటు కనిపిస్తూవుందిగదా? యీ సిగరెట్ల దిగుమతీని నిషేధిస్తే యెంతలోటు కనిపిస్తుందో? యివన్నీ పూడ్చాలంటే శక్యమో? కాదో? అదిన్నీకాక ఆ యీ వస్తువులు లేకుండా చేసి మాన్పించడమనేది కొత్తపంథ. మన పూర్వుల పంథ యిది కానే కాదు. నీతిచేత మనుష్యులు దుర్వ్యసనాలనుంచి తప్పించుకోవలసిందనే కాని, స్త్రీలను లేకుండాచేసి పురుష వ్యభిచారాన్నీ పురుషులను లేకుండా చేసి & వ్యభిచారాన్నీ మద్యం లేకుండా చేసి తాగుడ్డీ తగ్గించడం కానేకాదు. సమస్తమూ వుండనే వుంటాయి. వున్నా యెవండు యోగ్యండుగా వుంటాండో వాండే గణనీయుండని వాళ్ల తాత్పర్యం. అట్టి యోగ్యత కలగడం యేమహావ్యక్తులకోతప్ప దృశ్యాదృశ్యం. కనక పదార్థం దొరకుండా చేస్తే - “పురుషాణా మభావేన సర్వానార్యః పతివ్రతాః అనే మాదిరి నేcటి ప్రాజ్ఞలు సదుద్దేశంతోనే వక కొత్తమార్గం తొక్కుతూ వున్నారు. దీన్ని కాదనడానికి అంతకన్నా మంచిమార్గం చూపించే వారయితే తప్ప చేతంగాని ఆక్షేపకులకు యుక్తంకాదు. కాCబట్టి యీ యీతిబాధను తప్పించడానికి యీ సిగరెట్ల దిగుమతీ లేకుండా ఏదేనా సదుపాయం యిప్పటి గవర్నమెంటు చేస్తే చాలా విధాల బాలకులు బాగుపడతారని నాకు తోస్తుంది. కల్లు దుకాణాల స్థానంలో