పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


తెచ్చుకొన్న సిగ్బ అయిపోవడమున్నూ స్టేషనులో యొక్కడేనా కొనుక్కుందామంటే, వున్నచోటునుంచి కదలడానికి వీలులేకపోవడమున్నూ తటస్థించి పడ్డ బాధ నేను చూడలేకపోయాను. యెందటినో "అగ్నేయంతి" చేశాcడుగాని యెవళూ భిక్షపెట్టలేదు. ఆ కుట్టాండి వయస్సు సుమారు పదేళ్లు. అప్పడు నా వద్ద మారెండో చిరంజీవి అదే యీడువాఁడున్నాండు. వాండుకూడా చాటునామాటునా అప్పటికే అలవాటు పడ్డాడేమో? అని నాకు అనుమానం వుండడంచేత- "చూచావా, నాయనా! ఆ పిల్లాండు పడేబాధ చూచావా?" అంటూ యేవో నీతివాక్యాలు కొన్ని బోధించాను. ఆకారణంచేతో యేమో వాండుమాత్రం యీ అలవాటుకు లోCబడలేదు. బీడీలు యింతింత వెలగల వున్నాయో లేవో కాని మన దేశంలో వాట్ల ప్రచారమున్నూ ఆబాలవృద్ధంగా వ్యాపించేవుంది. మూ చిన్నతనంలో చుట్టలేకాని యివిలేవు. డబ్బు 1కి యిరవైచుట్టలదాకా యిచ్చేవారు. సిగరెటూ, బీడీలు వచ్చాక చుట్టలేమేనా చవకైనాయేమో? అనుకుంటే అదిన్నీ కనపడదు. అవి డబ్బు 1కి రెండుమూCడుగా వున్నాయి. మొత్తం యీ మూCడుగాని యిందులో రెండుగాని అధమం వకటిగాని అభ్యాసం లేని బాలవ్యక్తి నూటికి యే వొకటో తప్ప కనపడనే కనపడడు. కాస్త నాగరికత కలవాళ్లు మాత్రం చుట్టజోలికి రారు. యేబ్రాసులుగా వుండే పైల కాపుకుeూళ్లు చుట్టలూ కాలుస్తారుగాని వీట్లల్లో యేదో మహావిశేషం వుందని యీ నాగరికపు చుట్టలు (సిగరెట్లు, బీడీలూ) కూడా పండుగ పబ్బాలు తటస్థించినప్పుడు మాధానంగా కాల్చుకుంటూ వుంటారు. యిది యిప్పటికాలానికి సామాన్యసంసారులకు వక యీతిబాధగానే కనపడుతుంది. కొంచెం వైదికవేషంగా వుండేవాళ్లకో? చెప్పనే అక్కరలేదు. యిది చుట్టకంటేకూడా అనారోగ్యమనిన్నీ యింగ్లీష్పడాక్టర్లు చెప్పడమే కాకుండా పత్రికలలో కూడా వ్రాస్తూవుంటారు. కాని ఆ మాటలు యెవరూ పాటిచేసినట్టు కనపడదు. యితరుల మాటదాcకా యెందుకు? ఆ డాక్టర్లే సిగరెట్లను శరపరంపరగా కాలుస్తూవుంటే, యేమనుకోవాలి? పాశ్చాత్య నాగరికతకు యిది వక శిరోభూషణంగా ವಿನ್ಚಿಟ್ಟು 안9 నాగరికతకు అలవాటుపడినవారి ప్రవృత్తివల్ల గోచరిస్తుంది. యెందరో యిది నోట్లో వుంటేనేకాని మాట్లాడనేలేరు. మనదేశస్టులలో చుట్టకంటె నస్యానికి సభాపూజ్యత వున్నట్టే ఆదేశంలో సిగరెట్లకున్నూసభాపూజ్యత వున్నట్టు కనబడుతుంది. యెంతవఱకు సత్యమో? కాని కొన్ని బ్రాహ్మణాగ్రహారాలల్లో నవనాగరికత ముదిరిన బాలికలుకూడా పేకాడుకుంటూ సిగరెట్లు కాల్చుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూవున్నట్టు వినడం. అయితే నవనాగరికులు స్త్రీస్వాతంత్ర్య ప్రథమ సోపానంగా భావిస్తారనుకొంటాను దీన్ని చుట్ట కాల్చడంకూడా పూర్వం స్త్రీలలో అంతో యింతో లేకపోలేదుగాని ఆ ခြီဃ వేశ్యలూ యింకా తక్కువ తరగతివాళూగాని బ్రాహ్మణాగ్రహారాల కర్మం యీలా కాలినట్టు తెలియదు.