పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/758

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

862

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


మ. కొమరున్ బెండ్లికొమారుఁ జేసినపుడో, కూఁతున్ వివాహాఖ్య భ
     ద్రమహాపీఠి నలంకరించినపుడో, తత్తాదృగుద్దామ దా
     తృమహత్త్వంబు సమర్థ నీయమగు, నంతేకాని సన్యాసిబై
     క్ష్యమునాఁ డింతవ్యయమ్మొనర్చెడి వదాన్య శ్రేష్ఠులున్ గల్గిరే. - 4

మ. ఒకనూఱాఱిడఁ జాలదొక్కొ? మఱి మూఁడో నాలుగో యిచ్చియుం
     బ్రకటింపందొరకోవు తృప్తి, మఱి వస్త్రాలన్ననో? పట్టువీ
     యక సామాన్యపు జాతివీయ, వుభయం బర్పించియేతీరి, తె
     న్నక యెట్లుండఁగవచ్చు నీ వితరణానందంబు మౌళీశ్వరా. - 5

ఆ యీ పద్యాలల్లో వ్యాఖ్యానం చేయవలసినవేవిన్నీ లేవుగాని, ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు రాజనీతి సందర్భంలో వుదాహరించిన పద్యం మాత్రం సమయానికి జ్ఞాపకం రాలేదు. చదువరులు చూచుకోవలసి వుంటుంది.

ఈ ముక్త్యాల రాజావారి దాతృత్వానికి భయపడడం చేతనే యిటీవల మా యింట జరిగిన శుభ కార్యాలకు శుభలేఖ పంపడం కూడా మానివేశాను. చల్లపల్లిలో నూటపదహారులు వీరివల్ల ప్రతిగ్రహించాక మా కుఱ్ఱని పెండ్లి జరిగింది. వెంటనే తలుచుకోని తలఁపుగా నెలలోగానే కూఁతుల పెండ్లిండ్లు తటస్థించాయి. అప్పుడు శ్రీ రాజావారికి శుభలేఖ వ్రాయడం మానలేదుగాని, తాము ద్రవ్యం పంపనక్కరలేదు, చాలామంది జమీందార్లు సహాయం చేయడంచేత ద్రవ్యలోపం లేదు. అవసరమైనప్పుడునేనే మిమ్ము కోరుతాను, అని "షరా"లో వ్రాసినట్లు జ్ఞాపకం. యీ రాజావారి జనకసోదరు లొక పర్యాయము మా గ్రామం తోటల వైభవం చూడడానికి వచ్చినప్పుడు మా పాఠశాల చూచి శ్రీవారి యన్నగారితో మనవిచేసి రూ. 250-0–0లు నిల్వఫండు క్రింద పంపించారు. తుట్టతుదరోజుల్లో చందాలు వసూలు కానప్పుడు శ్రీవారు పంపిన ద్రవ్యము నుండే ఉపాధ్యాయుల జీతపులోటు భర్తీ చేస్తుండేవాణ్ణి. అలా భర్తీచేయడానికి వాడినప్పటికీ పాఠశాల మానివేసేటప్పటి కింకా కొంత సొమ్ము నిల్వవుంది. శ్రీరాజావారు నా పేర ఆ సొమ్ము పంపేటప్పుడు పాఠశాల వున్నంతకాలము దాని క్రింద వాడవలసిందనిన్నీ ఏ కారణం చేతనైనా పాఠశాల ఆపుచేసేయెడల మీ స్వంతంక్రింద మీరు వాడుకోవచ్చు ననిన్నీ సర్వాధికారాలున్నూ నా మీఁదనే పెట్టి వుత్తరం వ్రాయించారు. అలావారు వ్రాయించినా ఈ ద్రవ్యం మన స్వంతంక్రింద వాడుకోకూడదని మిగిలిన సుమారు యేభై రూపాయిలున్నూ అప్పుడప్పుడు వచ్చే యాచకుల కొఱకు ఖర్చుపెట్టేను. ఇంకా సుమారు. రు. 1-8-0 కాబోలును నిల్వ వుంది. అది కూడా వాడేశాయాలి. శ్రీ ముక్త్యాలరాజావారు