పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/753

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా ముక్త్యాల ప్రయాణము

857


శ్లోక పంచక నిరాకరణంలో తుట్టతుదిని వ్రాసిన పద్యాలకన్న అని యర్ధము. వారు యెట్టు వ్రాసినా గురుస్థానం గనుక చెల్లుబడి అవుతుంది. నేను వ్రాస్తే లోకం వప్పుకుంటుందా? అందుచేత నేను నమస్కరించి వూరుకోవలసిందే. అంతతో మాత్రం వారికి సంతుష్టి కలుగుతుందా? కాఁబట్టి "అయ్యా! నేను వ్రాయలేను" అని వ్రాస్తే బాగుంటుంది కనుక అలాగే వ్రాస్తాను. నే వూరుకున్నా యే శిష్టా వారో బయలుదేరుతారేమో? వద్దు మహారాజా వద్దు. నా మనవి చిత్తగించండి. శిష్టావారున్ను పరిమి వారున్నూ తెచ్చిపెట్టినదే నాకీ చిక్కు వీరి వ్రాఁతలో నా పేరు చేర్చడం వల్లనే గురువుగారికి కోపకారణ మారంభమయింది. ముట్నూరివారు కూడా కొంతనిమిత్తం కాకపోలేదుగాని ఆయన ధర్మమా అని నా పేరుమాత్రం ఎడిటోరియల్లో తలపెట్టలేదు. అందుకాయన్ని మెచ్చుకోక తప్పదు.

అంతలో కొల్లాపురం గోల వచ్చింది. దానితో నేను గురువుగారికి పూర్తిగా శత్రుపక్షంగా మాఱినట్లయింది. మీ పుణ్యమాయెగాని బాబూ! మీ రూరుకోండి. తరువాయి చిత్తగించండి.

"ఇట్లు వ్రాసినంత మాత్రఁదామెుక మహర్షులై మడిగట్టుకొన్న వారు కాలేదు. కామేశ్వరీ శతక మంతయుఁబర దూషణమే కదా? నీతులు చెప్పటకేమి?....."

దీని కేంవ్రాయను? నేను వ్రాయడ మెందుకు? గ్రంథం పెరగడానికే కదా? అది అలాటిదే యేమో? చిట్టచివరి వాక్యం కూడ పరిశీలించండి.

“వనంవారు మహారాణీగారితోc దప్పుగాc జెప్పుట చేతనే వారు నాకు దయచేయింతుమనిన.. పారితోషికము నాకు రాకపోయినది. ఇట్టి మహాదోషమునకుఁ గారకులు వనంవారు. వారిం గూర్చి యెట్లు వ్రాసినను దప్పు లేదనియు. వేంకటశాస్త్రిగా రెఱుగుదురు గాక.!”

ఈ వాక్యంతో గురువుగారు చేసినపని యెట్టిదో స్పష్టమయింది గదా. అభిప్రాయ మిచ్చిన వారిమీఁద కోపించడమెందుకు? సరే, అసలు గాథ వినండి.

ముక్త్యాలలో నున్నన్ని నాళ్ళూ గురువుగారి కొఱకే యత్నిస్తూ వుండేవాణ్ణి. ఇదివరలో వుదాహరించిన వేమూరి నారాయణరావును కూడ యి విషయంలో శ్రీ రాజావారితో మనవి చేయవలసిందని ప్రోత్సహించాను. అతఁడు కూడా సమ్మతించాఁడు. మా గురువుగారు కూడా ఇటీవల రాజమండ్రిలో నారాయణరావుతో కలసి మాట్లాడేరు. ఆ రోజున మేము ముగ్గురమున్నూ శ్రీయుత యెఱ్ఱగుంట్ల సుబ్బారావు (పెన్‌షన్ డిప్యూటీ మేజిస్ట్రేటు) గారింట విందుకు వెళ్లినట్లు కూడా జ్ఞాపకం. శ్రీ సుబ్బారావు పంతులుగారికిన్నీ