పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/745

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా ముక్త్యాల ప్రయాణము

849


నంశము కూడ గ్రహింప వలయును. రెండవ పక్షమున భావుక పదము యశస్సునకు విశేషణముగా నన్వయించుకోవచ్చును. “భావకం భవుకం భవ్యం" అని నిఘంటు. ఇట నింకను షష్ఠీతత్పురుషచే విశేషార్ధము వచ్చును గమనింపుఁడు -

ఉ. చెప్పెడివాఁడు కృష్ణకవి, చెప్పఁగఁజేసెడివాఁడవీవు మీ
    రెప్పటికిన్ మహాయశము నెంతయుc గాంతురు గాక, లోకపున్
    మెప్పునుగొండ్రుగా, కది సమీహితమేదియులేని నాకెటో
    గొప్పదనమ్ము దెచ్చుటకొకో? యని యెంచెద మీ వివాదముల్ - 13

చ. మృదుహృదయం, డమాయికు, డమేయుఁడు, కృష్ణుఁడు నీవొ? సత్కవీ
    డ్వదనముఁ గన్నమాత్రన ప్రపంచము సర్వము విస్మరించు సౌ
    హృదయము గలట్టి దాతృమణి విట్టిద్వయమ్మున కించుకంతయీ
    కదనము వేంకటేశునెడఁ గల్గిన కూరిమి పెంపు భూవరా. - 14

సీ. సచ్చిదానంద శ్రీస్వామి చాతుర్మాస్య
              కారణమ్మున వచ్చుఁగాక యిటకు
    రారె? నిస్పృహులయ్యు రాజుల కడకు య
              తీంద్రు లవ్యాజంపుఁ గృపకు లోఁగి
    అంతమాత్రన “యింత వ్యయమేటి" కనుక యిం
              దఱుఁ బండితులఁ బిల్చు ధన్యులుండ్రె?
    ఉండ్రుగా కేనేడ కొగి రాఁగ వీలులే
              కుండియు వచ్చుటెట్లొనరె? నీస

తే.గీ. మస్తమును నాకేదియొ గొప్పయశము దొరకు
       కారణంబని నామదిఁ గానఁబడెడి
       నితరనృపులఁ గాంచిన దొకయెత్తు, నిన్నుఁ
       గాంచుటొకయెత్తుసుమ్ము ముక్త్యాలభూప. - 15

తుట్టతుది పద్యంవల్ల ముక్త్యాలకు అస్మదాదు లెందుకాహ్వానింపఁబడ్డారో విస్పష్టం కాబట్టి విస్తరించేదిలేదు. అక్కడ నేను చేసిన ప్రయత్నం గురువుగారు నన్ను కోరితే చేసిందికాదు. తాత్కాలికంగా భగవంతుఁడు నాకు తోపిస్తే చేసిందే. దీనివల్ల నాకు మంచి కలుగుతుందని నేననుకొన్నాను. మొట్టమొదట అలాగే జరిగింది. దాన్ని కూడా టూకీగా వుదాహరిస్తాను. ముక్త్యాలనుండి నేను స్వగ్రామానికి వచ్చేటప్పుడు హఠాత్సంభవంగా