పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/726

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

830

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


(జాతకచర్య పూర్వార్ధము నుండి)

క. అనుపలుకు లచటిశిష్యులు
   విని నవ్విరి, ఆర్యుఁడెట్టి విధమున మీకున్
   జను వ్యాకరణముఁ జదువఁగఁ
   బనిగొనవలెఁ బంచకావ్య పఠనమ్మునకున్.

పై పద్యమువలన మేఘసందేశమేని పూర్తిగాఁగాని వానికి వ్యాకరణ పాఠము చెప్పుట యెట్లని యక్కడి శిష్యులు నవ్విరని స్పష్టము. పంచకావ్యములు చదువవలెనని ఆచార్యులుగా రనుటవలన, నింకను పంచ కావ్యములలో భారవియు, మాఘమును తరువాయి యని స్పష్టము. ఈ మాట జ్ఞప్తియందుంచుకొనుఁడు. చామర్లకోట చదువెంతవఱకు జరిగినదో చిత్తగింపుఁడు -

(జాతకచర్య పూర్వార్ధము నుండియే)

ఉ. భారవి మూఁడుసర్గలును, వ్యాకరణమ్మునఁ బంచసంధు లిం
    పారఁబఠించునప్పటికి అక్షికిఁబూర్వపు వ్యాధి కొంతహె
    చ్చై రసభంగమం గొలిపి యచ్చొటు వీడఁగఁజేసె నేరికే
    నారయ మేటిసంపద లనంత దురంతమహాంతరాయముల్

విస్తరము మఱికొన్ని వ్యాసముల యందును, ఉదాహరించిన జాతక చర్యయందును చూడఁగలరు. చామర్లకోట విద్యార్ధిత్వము నాఁటికింకను నేను మాఘకావ్యము మొదలిడలే దనునది సారాంశము. ఈ యంశము చదువరులు జ్ఞప్తియం దిడుకోవలెను. ఇఁక మాఘకావ్యము మొదలిడిన దెవరి యొద్దనో తెల్పి ముఖ్యాంశమునకు వత్తును.

(జాతకచర్య పూర్వార్ధము నుండియే)

క. పదపడి యితఁడాగ్రామము (చామర్లకోట) వదలి పరమ్మునకు వచ్చి
   (అనఁగా అప్పటి నివాసము ఫ్రెంచిటవును యానాము వచ్చి)....

గీ. ఊరికొక రెండుక్రోసుల దూరమందుఁ
   గలదు పిల్లంక యనియెడు గ్రామము....
   అందుఁ గలఁడు లఘు కౌముదిని
   నయమ్ముమైఁ జెప్పఁదగు ననంతాచార్యఘనుఁడు

ఆ.వె. పల్లెపాలెమనెడి పల్లెయునొక క్రోశ, మందుఁగలదు. సూరయా
       హ్వయుండు.... సాహితీఘనుఁడు - గలఁడచటను. -