పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/722

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

826

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


కృత భారతమును గూర్చి మా గురువుగా రెక్కడఁగాని నిగర్హణము నుపపాదింపఁ గూడదు. అట్లుపపాదించు నెడల నది న్యాయమైనను లోకులకు శత్రుత్వము కల్గించును. పాలకొల్లు సభలో “ఉ. నిండు మనంబు నవ్యనవనీత" అను పద్యమును గూర్చి శ్రీవారు ఖండింపఁబూనుటయు దానిపైఁ గొందఱు వీరి పద్యములోని యేదో మానుటను గూర్చి ప్రశ్నింపఁగడఁగుటయునట్టి యెడ నేను నాకుఁ దోఁచిన విధమున నేవో రెండు పొడిమాటలు చెప్పి యప్పటి కా వివాదము నాఁగుటయు శ్రీ మాగురువుగారే కాక నాఁటి సభ్యులెల్లరు వినియున్నారు. పూర్వ భారతము కన్న వీరి భారతమునందు మెఱుఁగు లున్నయెడల, లేవని వాదించువారికి లోకమే జవాబు చెప్పును. కావున నా భారము లోకులకు వదలివేయుఁడని గురువులను బ్రార్థించు చున్నాఁడను. -


★ ★ ★