పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/718

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

822

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


జదివిచూచినాను. ఖండనకు మార్గ మగుపట్టదయ్యె గాలికి దూలికిఁ బోయెడి దెన్నటికిని గాదు అని నాకుఁ బూర్తిగాఁ దోఁచినది. ఆ త్రోవ మా గురువులకే కాదు. కొండొక మా శిష్యునకును బాధకముగనే యున్నది. ఇట్టి స్థితిలో మధ్యనున్న నాకు మాత్ర మది బాధకము కాక యుండునా? అగుఁగాక. చేయవలసినదేమి? పొడమిన కోపమునడఁచి కొంటిని. నేను జదివికొన్న కావ్యములలో భారవి ద్వితీయ సర్గమందు నాకు నభిమానము మెండు. ఈ యభిమానము నాకపుడు “విజితక్రోధరయం జిగీషవః ” “సహసా విదధీత న క్రియామ్" లోనగు సందర్భములను జ్ఞప్తికిఁ దెచ్చి మిక్కిలి యుపకరించెను .

బ్ర||శ్రీ|| శిష్టా నరసింహశాస్త్రులవారి వ్యాసము కృష్ణా పత్రికా ప్రధానవ్యాసమును స్థిరీకరించుటకై స్థూణానిఖననన్యాయమున బయలుదేరినది. కృష్ణరావుగా రెంత సూత్ర భాష్యాదుల నభ్యసించినను లౌకిక పండితులేగాని వైదిక పండితులు కారు. కావున వైదిక పండితుల సమ్మతికై యది పుట్టినది. అంతియకాక యందుఁదుట్టతుదనున్న బ్ర|| శ్రీ|| పరిమి నరసింహశాస్త్రులవారి యేకీభావ వాక్యములను గూడఁ జదివితిని. పిమ్మట వారిరువురును గూడ నగుపడిరి. కొంచెము కదలించి చూచితిని. అందు మొదటివా రభినందన మందును ననభినందన మందును గూడఁ బాల్గొనిరి. కాని యందొకటి పరేచ్ఛా ప్రారబ్దమును, రెండవది స్వేచ్ఛా ప్రారబ్ధమును నైయున్నది. రెండవవారిది సర్వమును రెండవ తరగతి లోనిదే. ఇందు రెండవవారును నేనును జిరకాలము హిందూ హైస్కూలులోఁ బండితులుగాc బనిసేసి యున్నారము. ఈయన పాండిత్యమును శీలమును నేనెఱుఁగుదును. పాండిత్యము జగత్ప్రసిద్ధమే. ఇఁక శీలమో, యెఱిఁగిన వారు కొందఱు మాత్రమే యుందురు. ముఖ్యాంశ మేమన? ఈయన యే మంచి కార్యమునందుఁ గాని యే చెడ్డ కార్యమునఁగాని లేశమును బాల్గొనక వారి పనివారుచేసికొని యేగువారు. వీరి కొకరితో సంబంధమే లేదు. అట్టివారీ ప్రస్తుత కార్యమున నీమాత్రమేని యేల కలిగించుకొనిరో యింకను విచార్యమే. ఏమయిన నేమి, వీరి యిరువుర సమ్మతి తోడను కృష్ణారావుగారి ప్రధాన వ్యాసమునకుఁ బూర్తిగా బలము కల్గినది. ఈ నరసింహశాస్త్రులవారి వ్యాసములోఁ బ్రస్తుతాంశమునకు బలము కలిగించు మాటలే కాక కొన్ని మాటలు నా ద్వారమున శ్రీవారి నధః కరించు దురూహను వెలిఁబుచ్చుచున్నవి.

శ్రీ మాగురువుగారికి "సార్వభౌమ పదమబ్చినచో" నాకు స్థాన మెక్కడనని కూడ వీరు కొంత చింతించినారు. ప్రత్యేకించి యెత్తికొని వ్రాసినచో మిక్కిలి పెరుఁగును (తమకును మా గురువులకును గల వివాదములో నా పేరెత్తికొని నన్ను గొప్పఁ జేయ నుంకించుట నాకు మిక్కిలి విచారకరము.) శాస్త్రులవారికి నా యందభిమాన మున్నచో దానికిది