పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/707

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనుగుడుపు

811


గృహస్థులకు వైద్యం చేయడానికేంగాని, ప్రభువులకి వైద్యం చేయడం చాలాకష్టం. వాళ్లకి దినదిన గండమే. అందుచేతనే "దివసే దివసే మరణం, యత్పరచేతోను రంజనం వృత్తిః" అని పెద్దలు వ్రాశారు. . -

ఇది యీలా వుంచుదాం. బందరు నుంచి వచ్చిన మందులు విప్పనే లేదన్న దగ్గఱనుంచి మళ్లా మొదలెడతాను. మందుకోసం గాదుగాని, ఆ పార్శిల్లో నస్యం కూడా వుండడం చేత, పంపిన యిరవైరోజులకి కాబోలును విప్పాను. అందులో వ్రాసిన ప్రకారం ఆ మందు వాడేను, ఆఱుపూటలు వాడేటప్పటికి వ్యతిరేకించింది. వుపకారం కూడా చేసిందికాని, దాన్ని నేను గమనించనేలేదు. అంతట్లో దాన్ని ఆపి యెట్లో ఆ వ్యతిరేకాన్ని సర్దుకున్నాను. మళ్లా మందువాడి క్రమంగా కొంత సుఖంపొంది ఆ మందు పంపిన డాక్టరుకు వక పద్యం వ్రాసిపంపాను. ఆ పద్యం యిక్కడ వుదాహరించడం మంచిది కదా?

ఉ. అద్యతనుల్ గలారు భిషగగ్రణు లెందఱునేని; ఆంగ్లపున్
    వైద్యము దేశివైద్యమును "ప్యా" సయినట్టిరు, "ప్యాసు" గాని నీ
    వైద్యమె నాకు సౌఖ్యమిడి పద్యమిడం బురికొల్పె "స్వస్తితే"
    వైద్యశిరఃపదంబుకొని వర్ధిలు శేషగిరీఁ గిరీట్కృపన్,

ఈ పద్యం మాత్రమే చెప్పి వూరుకోలేదు. కేవలం పై పద్యంలో పేర్కొన్న డాక్టరు శిష్యునివల్లనే యీ వుపకారంకాలేదు. కృతికన్యా జనకులలో రెండవవాడు వేంకటేశ్వరరావునకు కూడా యిందు కొంత భాగం కలదు. అందుచేత,

మ. కరమున్ బత్తిని గావ్యకన్యనిడుటన్ గాటూరి శ్రీ వేంకటే
     శ్వరుఁడీ నే నెడయైనఁ గావ్యసుతకున్ వైధవ్యయోగంబు దా
     పరమౌ నన్నభయాన శేషగిరిచేఁ బంపించె మేల్మందులన్
     మఱవంగూడదు వానికిన్ యశము సంపాదింపు మృత్యుంజయా,

అని కూడా వకపద్యంలో వ్రాశాను. కాని దీనితో కూడా మనస్సు తృప్తి తీరింది కాదు. అందుచేత యింకోపద్యంకూడా వ్రాశాను.

మ. రుజకున్ మందులు వారకంబులనుటే రూఢంబు, సామాన్యులౌ
     ప్రజలిట్లేవచియింత్రు ప్రాజ్ఞులు మహాపద్వారకు నిన్ను దూ
     రుజలందున్ స్మరియించి మేల్గనుటయున్ రూఢంబ యిప్పట్ల న
     కుజ మేమున్నది? ప్రస్తుత స్తవమె సాక్ష్యమ్మిచ్చు మృత్యుంజయా.