పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/698

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

802

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


ప్రాయమున స్వర్గతులైన నారయ్యప్పారావుగారిని శ్రీపంతులవారు స్వయముగా నెఱుఁగుదురు. శ్రీపంతులవారు నూజివీట నున్న ప్రభువుల యాదరణము మీఁద నట వసింప నుద్యమించుట మే మెఱుఁగుటయేకాక శ్రీవిరవవెంకటసూర్యరాయ విద్వద్వతంసుఁడు గూడ నెఱుఁగును. ఆ నారయ్యప్పారావుగారి రాబడికిని ఆయన దాతృత్వమునకును గల ప్రసక్తి పంతులవా రెఱుఁగుదురు. మే మెఱుఁగుదుము. ఆయన నేటేట దర్శించి వార్షికములుకైకొను పండితకవు లెఱుఁగుదురు. మఱియు నూతనముగా రాజ్యమునకు వచ్చిన శ్రీ ఉయ్యూరు ప్రభువునకుఁ గల విద్వదాదృతి కవితాప్రసక్తి లోనగునంశములు మామిత్రు లెఱుఁగనివారు కారు. కారణాంతరమున నిపుడు నూజివీటి రాజులలో నొకరును బిఠాపురాధీశుల కైశ్వర్యమున దీటుకారు. గద్వాల లోనగు సంస్థానము లేని యింతకుఁ గొంత లొచ్చే అయినను విద్వత్కవ్యాదరణాదికమున నెన్నిరెట్లు హెచ్చదురో పంతులవారు పరికింప వలయును. రాఁబడిలో నెన్నోరెట్లు హెచ్చగు మైసూరు, బరోడా లోనగు సంస్థానముల యందలి విద్వత్పరీక్షలు సమ్మానములు నిట విస్తరించుట ప్రస్తుత భోజోపమితి వంటిదే యగుట వదలుచున్నారము. ఒకపరి మైసూరుప్రభువు రాయచూరు మార్గమున రైలుప్రయాణము చేయునవసరమున నామహాప్రభువును సందర్శింప గద్వాల భూపాలుఁ డరిగినపుడు ప్రసంగవశమున నా మైసూరుప్రభువు "రాజా మీ సంస్థాన మెన్నికోట్ల రాబడి గలది?" యని యడిగెనఁట. దానిపై "అయ్యా నేను మీ సంస్థానము నందలి యొక్క పెద్ద గృహస్థువంటి వాఁడను కొన్ని లక్షలు మాత్రము వచ్చువాఁడను." అని గద్వాల రామభూపాలుఁడు సవినయమున విన్నవింప మైసూరు ప్రభువు నమ్మక “నీయశమును బ్రతివిద్వాంసుఁడును వర్ణించుచుండునే. అనేక పర్యాయములు నీకీర్తిని పండితుల వలన మేము వినియున్నారము. నీ రాబడి యింతస్వల్పమైన నీకుఁ గోట్లవచ్చు సంస్థానాధి పతులకన్న నెక్కుడు యశ మెట్లు వచ్చెడిని?” అని మరలఁ బ్రశ్నించెనఁట ! దానిపై గద్వాల ప్రభువు “ఇయ్యది మీ యనుగ్రహబల" మని విన్నవించెనఁట! ఈ ప్రసక్తి జరుగుదినములలో మేము గద్వాలలో నుంటిమి. ఆ ప్రసంగము విన్న రాజాశ్రితుల కతన నెఱిఁగి వెంటనే

సీ. కోటివచ్చెడి రాజ కోటీరమణియైన
                 నిటువంటి సత్కీర్తి నెనయఁగలడె.

అను పద్యమును జెప్పితిమి. ప్రస్తుత మేమనఁగా, నేఁటికాలమున విద్వాంసుల నెంతో ప్రీతితో నాదరించు మహాప్రభువులు చిన్నలలోఁ బెద్దలలోఁ గూడ నప్రధానముగా విద్వద్గౌరవమును బ్రధానముగా ధర్మాభాస గౌరవమును గైకొని ధర్మాభాసమున