పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/695

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహాకవి భోజమహారాజు

799


సార్వభౌముఁడు తిమ్మనృపతి కాశ్రితుఁడై ముఖస్తుతి చేసె ననుకొను వారుందురా? ఉందురేని యా పెద్దాపురప్రభు వెంతమహాకవియో తెలుపఁదగు నీక్రింది శ్లోకమును గూడ నుదాహరింతముగాక.

శ్లో. నాళీకభంగకృ దతీవనదీనబంధు
    ర్నక్షత్రపో, నవసుధావిభవైక హేతుః
    రాజాకిమిందురపి నార్యభిమానహారీ
    రాజా పరం విజయరాఘవసార్వభౌమః.

ఈ శ్లోకము తిమ్మజగపతి మహారాజు విజయరాఘవ సార్వభౌమునిపై రచించినది. విజయరాఘవ సార్వభౌముఁడు రచించిన శ్లోకమే నిరుపమాన మనఁదగినది కాని దీనిని విన్న పిదప దాని కాగౌరవము దక్కదు. ఈ శ్లోకము వంటి శ్లోకము కాలత్రయమునందును జనింప రానిదని విద్వాంసుల యభిప్రాయము. దీని కించుక వ్యాఖ్యానము రచింపవలసినదే కాని గ్రంథవిస్తరమును బత్రిక సహింపదు. అన్వయించుకొనుమార్గ మిది. న అళీకభంగ కృత్ = నాళీకభంగకృత్, విజయరాఘవ సార్వభౌముఁడు, అళీకభంగ కృత్తు, అనఁగా, 'అళీకం త్వప్రియే౽నృతే, కనుక అప్రియమునో, లేక, అనృతమునో, రూపుమాపువాఁడు. ప్రభువైనవాని కిదిలక్షణముకదా? లోకమున కప్రియమైనదానిని వారించుటకన్నఁ బ్రభువున కవశ్యకర్తవ్య మేముండెడిని? ఇఁకఁ జంద్రుఁడో, అళీక భంగకృత్తు కాఁడు. ఇఁక నేమన? నాళీక భంగకృత్తు, అనఁగాఁ బద్మములను రూపుమాపువాఁడనుట. ఇట్లే నార్యభిమానహారీ. న అర్యభిమానహారీ = నార్యభిమానహారీ అనియు, నదీనబంధుః = న+దీనబంధుః, అనియు, న+క్షత్రపః, నక్షత్రపః న+వసుధావిభవైక హేతుః న వసుధావిభవై కహేతుః" అనియు, వ్యస్తము లుగను సమస్తములగను నాయాయీ విశేషణములను రాజపక్షమందును జంద్రపక్షమందును యోజించి రాజుకన్నఁ జంద్రుఁడు నికృష్టుఁ డనువిశేషమును జంద్రునకు సహజముగా వాడు విశేషణముల వలననే సమర్ధించిన యీతిమ్మజగపతి మహారాజునకుఁ గవితో భోజుఁడేనియు సరిగాఁడను నది సహృదయైకవేద్యము. అట్టి స్థితిలో నీయనుపమానునికి భోజోపమానము లజ్జాకరముగాదా? అయినను నతఁడును మహాకవి యితఁడును మహాకవి యని విజయరాఘవ సార్వభౌముడట్లు పోల్చి యుండును. ఈ విజయరాఘవ మహాకవి రచించిన సావిత్రీ చరిత్ర, విష్ణుభక్తిసుధాసాగరము అను రెండు తెలుఁగు ప్రబంధము లొకటే సంపుటముగా శ్రీ మొగల్‌తుర్తి సంస్థానమునందు మేమిప్పటికి నిరువది మూడువత్సరముల క్రిందటఁ జూచియున్నారము, భాషోద్ధారకులా గ్రంథము లచ్చొత్తించుటకై సంపాదింపఁ గోరుచున్నారము. వాని ప్రకటనము వలన