పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/693

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది



797


మహాకవి భోజమహారాజు

(23-11-1918 సం||ర కృష్ణాపత్రిక నుండి)

ఈ మహారాజును బూర్వకవ లెట్టివారి కుపమానముగాఁ గైకొను చున్నారో సుంత విచారింపవలసివచ్చినది. ఈయనఘుఁడు తాను మహాకవియై తనయైశ్వర్యమును మహాకవులకుఁ దంగెటిజున్ను గావించినవాఁడు కావున నీ రెండు విషయముల నిటీవల సుప్రసిద్దు లెవరేని రాజులం దవతరించినచో వారి నియ్యద్వితీయుతోఁబోల్చు చున్నారు. అందును నీతనికి ముఖ్యము వైదుష్యము కాని దాతృత్వమాత్రము కాదనునంశము చదువరులు మనమున నుంచికొని యీపై భాగమును జదువవలయును. ఈయంశము నీక్రిందిశ్లోకము బోధించెడిని.

శ్లో. అంభోజం కలయన్ సదృక్ష మవనే సాహిత్యరీత్యాం దృశో
    ర్మాంధాతార మపారసంపది మహద్భావే యశోరాశిషుః
    శత్రూణాం పురభంజనే ధృతిగుణే కించోరగేంద్రం మతి
    ప్రాగల్భ్యే ప్రతిభాతి తిమ్మనృపతిః పాకాహితప్రాభవః.

ఈ శ్లోక రత్నము సుమారు నూఱుసంవత్సరములకు మున్ను శ్రీశ్రీ పెద్దాపురపు మహారాజుగారిని గూర్చి తాత్కాలికపు విజయనగర ప్రభువగు శ్రీ విజయరాఘవ సార్వభౌముఁడు రచించినట్లు విద్వత్పరంపర వలన వినుచున్నారము. ఈ ప్రభువతం సులిరువురును మహారాజులగుటయే కాక మహాకవులును నయి తమ యైశ్వర్యమునకు వన్నె వెట్టినవారఁట. వీరిరువురును బినతల్లి పెదతల్లి బిడ్డలఁట. పై శ్లోకమును రచించిన ప్రభువు మాటటులుండ నాప్రభుని యుంపుడుకత్తె యగువేశ్యకూడ మంచికవయిత్రి యనుట కీ క్రింది పద్య ముదాహరింపఁ బడుచున్నది.

ఉ. ఏవనితల్ మముం దలఁప నేమిపనో? తమరాఁడువారుగా
    రో? వలపింపఁగా నెఱుఁగరో? తమకౌఁగిటిలోన నుండగాఁ
    “రావదియేమిరా? విజయరాఘవ?” యం చిలుదూరి బల్మిమైఁ
    దీవరకత్తెనై పెనఁగి తీసుకవచ్చితినో తలోదరీ.