పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/691

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రభోజుఁడననేమి?

795


కాన వ్యాఖ్యానమనావశ్యకము. కొంతకాలము మేము గూడ “దేవయ్య" అనియే వాడితిమి. ఇటీవల నెఱిఁగితిమి. ఎకారసంధి విషయమునకుఁగూడ మాకుత్తరమును శబ్దమును దెల్పిన పండితులే తెల్పియున్నారు. అవసరమైనపు డావిషయమును విస్తరింతుము. ఇఁక రామకృష్ణుల “దేశభక్తి" వ్యాస మిపుడు వెలువడినంత వఱకు శోచ్యస్థితిలో నున్నదని యందలి “గురుబ్రువ" పదము చేతనే సహృదయులు గుఱితింపవచ్చును. వీండ్రకు గురువు, గురుబ్రువుఁడు; పిత, పితృ బ్రువుఁడు; మాత, మాతృబ్రువ. ఇట్టి దుఃస్థితిలో వీండ్రవివేకులేలకారు? ఈ సందర్భమున వీం డ్రిట్లేదో పత్రికలయందు గిలుకుచుఁ గాగితపుకఱవు దినములలోఁ గాగితములు వమ్మొనర్చుటకన్న సభాస్థలికి వచ్చి తమ "అపరాధమును" సమర్థించుకొనుట సమంజసము. ఏ సభలోఁగాని యటులొనరించి సభ్యులను సంతుష్టిపఱచి తాము లోకమునం దాపాదించుచున్న “భ్రాంతచిత్తులై" అను నంశమును స్థిరీకరించినచోఁ దమపోషకులకేమి తమకేమి మంచి గౌరవముగదా? ఆ సభకుఁ బిలువకున్నను మేము వత్తుము మాయెదుట మా శిష్యుల నోరెంతవఱకు సాగునో? చూడవలయునని మాకెన్నాళ్లనోయుండి కుతూహలము కలదు. ఆ సంవత్సరాది సంచికలోని వ్రాఁత యితరుల వాక్యముల కనుకరణమే కాని, తమది కాదఁట? వహ్వాఁ ఈత్రోవ “క్షమాపణ చెప్పుట” కపరపర్యాయము కాక మఱేమి? ఆయవివేకపుఁ గూఁతలన్నియుఁదమ సొంత మాటలే. అనుకరణములు గావు కావు కావు. ఏ గ్రుడ్డివాఁడును దీని నంగీకరింపఁడు. ఇంతటనేని ఋజుమార్గమున క్షమాపణచెప్పి చక్కఁగా బ్రదుకుట యుక్తము. సహృదయులారా! కొడుకో, తమ్ముఁడో, శిష్యుఁడో, వేఱొకరుఁడో, యవివేకియై దొసఁ గొనరిఁప వాని కేడుగడయగు తండ్రియో, అన్నయో, గురువో, వేఱొకఁడో “అయ్యా! మావాని తప్పును మన్నింపవలసినది" యని ప్రార్థించుటయు, లోకు లామాటను విశ్వసించి యాయవివేకమును క్షమించుటయు నేఁడు పుట్టినవి కావు. కావున మావాండ్రింకను గిల్కుచున్నారని మీరాగ్రహింపకుఁడు. క్షమింపుఁడు.

"వివేకభ్రష్టానాం భవతి వినిపాత శ్శతవిధః" అను భర్తృహరి వచనము మీయెఱుఁగనిదికాదు, మావాండ్ర తెలివికిఁ గృష్ణాపత్రికాధిపతి గూడ నిప్పట్ల నింద్యుఁడే యయ్యె కారణ మతఁడు వెనుక మమ్మును గోళ్లనుగా వ్రాసినాఁడట! ఇటీవల నట్టివ్రాఁతకుఁ దావలమగు మమ్మునే తమ మీదికిఁ బురికొల్పెనఁట! వీండ్రాకోళ్లవ్రాఁతనే చూచి పదపడి మేము బందరువదలి వచ్చుతఱి వ్రాసినవ్రాఁత చూడకుండుటకుఁ గత మేమో? కృష్ణాపత్రికాధిపతి మాకును దమకును గొప్పరపువారికిని జరుగు నసమానకలహమునందు రోతపుట్టి కోడికి వేఱొక కోడి యెదురఁ బడినంతనే శౌర్యము వహించుటయే సహజమైనట్లు తి.వెం. కవులకుఁ గూడఁ దారతమ్యవిచారములేకే శౌర్యముదయించుచుండు నను