పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/690

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

794

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


ఘూర్ణిల్లి యల్లకల్లోల మగుచున్నను తమ వద్ద నుండుకవుల యవివేకమును వారింపక యింకను నేవో తప్పుడు యుక్తులతో “దేశభక్తి" నామకఘృతకోశవ్యాసములను వ్రాయుచుఁ బత్రికాపాఠకులకు రోఁతపుట్టించునవ్యక్తుల నుపేక్షించు శ్రీరాజాగారు "ఆంధ్రభోజు" లైన నగుదురుగాక. రామకృష్ణుల యవివేక ప్రయుక్త కృతులకు “అనుమోదకులు" కూడఁగా రనునంశమును పంతులవారెట్లు సమర్థింతురో? మేము వినఁ గుతూహల పడుచున్నారము. పంతుల వారి “ఆంధ్రభోజపదము” పంతులవారికో లేక రామకృష్ణులకో “ఆంధ్రకాళిదాసత్వము" నాపాదింపక తీరదు. రామకృష్ణుల స్థితిని బట్టి దీనిని వహించి సంతసించుట వాండ్రయవివేకమునకు వన్నె పెట్టుటయే యైనను బంతులవారి యుదారతను బట్టియేమి, యోగ్యతనుబట్టియేమి, వివేకమును బట్టియేమి, యీ భారము వారు వహింప నంగీకరింపరని మేమేకాక లోకులెవరేని సమ్మతించి తీరవలయును. పంతులవారు చేయు ప్రయత్నము మంచిది. వారి వ్యాసము ప్రభువునకు రామకృష్ణుల యవివేకమునఁ గల్గిన నిందను వారించుతలఁపుతోఁదక్క నన్యకారణమును బురస్కరించుకొన్నది కాదు. మాచే విమర్శింపబఁడిన “ఆంధ్రభోజపదము” వారప్రధానముగా వాడినది కాని ప్రధానముగా వాడినది కాదని మే మెఱుఁగక యింతవఱకు వ్రాయలేదు. సాదృశ్య శబ్దార్థ విషయమునఁ బంతులవారి యూహయేమో కనుఁగొన నింతగా వ్రాసితిమి. కాన వారన్యథా తలఁప కుందురుగాక! వారి “నిష్కారణనింద" పై శ్రీశ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి గురుపాదులు వ్రాసిన దానిం జదివితిమి. మావలెనే పంతులవారును శ్రీశాస్త్రులవారును నాబాల్యమిత్రులయ్యు దానిన్ గణింపక యథార్థము పట్టున శాస్త్రులవారొనరించిన వ్యవసాయము కడు శ్లాఘనీయము. శ్రీ శాస్త్రులవారు రామకృష్ణులు మున్ను నింద్యగ్రామ్యమని వ్రాసి చీవాట్లు దినిన “క్షమాపణ" పదమునందలి నిర్దుష్టత నెఱిఁగినవారే యయ్యు నచ్చటచ్చటఁ బ్రస్తుతవ్యాసమున నీపదమునకు బదులుగా నేఁటి కూరగాయ కవులుపయోగించు "క్షమార్పణ" పదముపయోగించినటుల స్ఫుట మగుచున్నది. కాని ఇది సత్యదూర మని యీ సందర్భమందే మఱియొకచో వాడిన “క్షమాపణ" పదమువలన సహృదయులు గుణితింపఁ గలరు. క్షమాపణకు బదులుగా “క్షమార్పణ" యని పడినచోటులెల్లఁ బత్రిక కూర్చువారలవి యని యెఱుఁగఁ గోరుచున్నారము. దీని కింతగా నేల వ్రాయవలయు నన్న మా వెం||రా|| లిది యాధారముగాఁ జేసికొని మరల “క్షమాపణ" పదమునకుఁగా బెనఁగఁ గలరని తప్ప లేకున్నచో నింతగాని కొంతగాని వ్రాయనే యక్కరలేదు. మఱియు శ్రీశాస్త్రుల వారు దేవ +అయ్య, దేవయ్య అని వ్రాసిన వ్యుత్పత్తిని మేము శిరసావహించుచు, “దేవయ్యకాదు, దేబయ్య అని కొండొకచో మేము విన్న సందర్భము నిందు వివరించుచున్నారము. దేబె +అయ్య, దేబయ్య, అని దాని వ్యుత్పత్తి అర్థము విస్పష్టమ