పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/689

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

793


ఆంధ్రభోజుఁడననేమి?

(26-10-1918 సం||ర కృష్ణాపత్రిక నుండి)

పూర్వము సంస్కృత భాషయందు మహాకవియు నత్యుదారుఁడును

శ్లో. ఉచ్చైర్గతి ర్జగతి సిద్ధ్యతి ధర్మతశ్చే
    త్తస్య ప్రమాచ వచనైః కృతకేతరైశ్చేత్
    తేషాం ప్రకాశనదశాచ మహీసురై శ్చే
    త్తానంతరేణ నిపతే త్క్వను మత్ర్పణామః.

అనునంతటి బ్రాహ్మణభక్తి వివేకవిశ్వాసములకు నాకరమైనయెుక రాజు భోజవంశోత్పన్నుఁడుండువాఁడనియు నిటీవల నెవ్వరేని యత్కించిద్బిద కలిగినను, తన్నిష్ఠభూయోగుణ విశిష్టులు రాజు లందవతరించినచో వారికీ బిరుద ముచితమనియు మా మిత్రులు మ.రా.రా. పానుగంటి లక్ష్మీనృసింహారావుపంతులవా రభిప్రాయపడి రామకృష్ణుల యవివేకమువలన శ్రీపీఠికాపురాధీశ్వరునకు "ఇనుమునుబట్టి యగ్గికి సమ్మెటపెట్లు" అను సామెతగా ననివార్యముగా సంక్రమించుచున్న యపయశమును దొలఁగించుచు వ్రాసిన "నిష్కారణనింద" అను వ్యాసమునఁ గొండొక సందర్భమున శ్రీవారికాబిరుదమును వ్రాసియున్నారు. శ్రీ పీఠికాపురాధీశ్వరులను స్తుతించి విద్యలకుఁ బ్రోత్సాహము కలిగించుట మాకుఁ బరమ సమ్మతమేకాని “తద్భిన్న త్వేసతి తద్గతభూయో ధర్మవత్త్వం సాదృశ్యమ్" అను సాదృశ్య లక్షణమును సుంతేని పంతులవారు విమర్శింప లేదుగదా యని విచారించుచున్నారము. ఈ యంశ మొక్కటితక్క శ్రీపంతుల వారి వ్యాసములో మే మితరమును సృశింపము. కారణము, శ్రీశ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రులవా రాభారమును వహించి పూర్తిగాఁ గృతకృత్యులై యుండుటయే. పంతులవారు రామకృష్ణులతప్పును బూర్తిగా వ్యంగ్య మర్యాదచే బలపఱచుచు శ్రీరాజాగారి కందు సంబంధమును గల్గింపఁగూడదని మాత్రము వ్రాయువ్రాఁత మాకును సమ్మతమే. కాని, యది యనివార్యమగుటచే "శ్లో. తస్మాదపరిహార్యే౽ర్థే" అను గీతావాక్యమును స్మరింపక తప్పదు. శ్రీరాజాగారు మా రామకృష్ణుల యపచారమునకుఁ గర్తలుగాని కారయితలుగాని ప్రేరకులుగాని కారనునది సత్యము. ఐనను లోకమెల్ల నిందువిషయమున నేకవాక్యతగా