పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/680

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

784

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


బొట్టమోపుగా చిట్టచివర పిట్టగోడమీఁద ఉన్నాఁడేమో తన్మయత్వంలో తూలిపడి యేం కావాలో అదే అయి గొంతెమ్మ కోరికలకు ఫలితం యిలా వుంటుందని లోకులు యితిహాసంగా చెప్పుకొనేదిగా పరిణమించింది. చక్రవాకి మూర్ఖజంతువు. దీనిమీఁద బెట్టుసరి. గొంతెమ్మ కోరికలు యెవరికీ ఫలించవుసరిగదా వ్యతిరేకించి ముప్పు తెస్తాయని కూడా ప్రాజ్ఞులు తెలిసికొంటారు. యీ శ్లోకంవంటి శ్లోకం మనం (మేనమామ పోలికగానేనాసరే) రచించఁగలమా అని శ్రీవిజయనగరం మహారాజులుగారి సందర్శన సందర్భంలో కొన్ని రచించివున్నాం, అందొకటి సంస్కృతం, వొకటి తెలుఁగు. రెండూ విజ్ఞుల వినోదార్థం వుదహరిస్తాను. -

“శ్లో. తత్కించంద్రాతపో౽యం నను భవతిదివా౽ప్యస్య కస్మా త్ప్రచార
     స్సత్వాచ్చంద్రస్య సత్వే౽ప్యరుణ కిరణతో౽ జాగళస్థస్తనో౽యమ్
     నోచే దానందదంతీశ్వర విమలయశస్సత్యమిత్యాదివాక్యై
     శ్శాస్త్రార్ధంకుర్వతే త్వద్యశసినృపమణే తార్కికాస్తరరీత్యా"
                                                 (ప్రశ్నోత్తరరీతిని సమన్వయించుకోండి)

శా. నీకీర్తివ్రతతుల్ ధరాతలము నెందే నిండి అందొక్కఁడ
     య్యాకాశమ్మున కేగి పుష్పవతియై ఆపూర్వపశ్చాద్గిరి
     వ్యాకీర్ణం బగుచుండు వాయుగతిచే నద్దాన చంద్రో౽యమి
     త్యాకారభ్రమ నొందుచుండు జగ మో యానంద భూపాలకా.
                                                (యిందులో ప్రధానం ఉత్ప్రేక్ష)

"తే. గీ. అర్థవత్తని అనధీనమని ... ... అర్ధవత్సూత్ర
         మందు గూఢముగఁ జెప్పె పాణిని"

యిందులో కవిత్వపదార్థం లేదుగాని రచించిన వాఁడు వ్యాకరణవేత్త అని తెల్లమవుతుంది.

శ్లో. క్లీబంపుసోస్తు దేహో౽స్త్వేకో మాత ర్నతత్ర బహుచిత్రమ్
    స్త్రీపుంసయో రపి తథా లలితే యద్దృశ్యతే మహ చ్చిత్రమ్.

(దీనికి సమన్వయం రంగూనుత్తరం తెలిస్తే తెలుస్తుంది - అనగా ఎవరు రచించారో వారి దగ్గిఱకి వెళ్లి తెలిసికోవలసిందనడం) -

శ్లో. పద్మం న యోగ్యవస్తు స్యా దే వాత్మోప మిత్యవస్థాయామ్
    ఇత్యేవ మద్రిజాతే కంఠరవే ణాంబ వక్తినేత్రం తే.