పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/673

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంతా రామమయం

777


విన్నాను. కాని యిప్పుడెవరేనా చెప్పవలసిందని అడిగితే మళ్లాపుస్తకాపేక్షే పాకాలలో నారికేళపాకం కూడావున్న మాట అందఱూ యెఱిఁగిందే కాని పైనిచూపినరచన దానికి వుదాహరణం కాదు. దానికి వుదహరించవలసి వస్తే-

మ. తలఁబక్షచ్చటఁ గ్రుక్కి బాతువులు కేదారంపుఁ గుల్యాంతర
     స్థలి నిద్రింపఁగఁజూచి ఆరెకు లుషస్స్నాత ప్రయాత ద్విజా
     వళి పిండీకృత శాటులం చవి తదావాసంబులన్ జేర్ప రే
     వులడిగ్గంగను వారీఁ జూచి వెస నవ్వున్ శాలిగోప్యోఘముల్

యీలాటి పద్యాలు వుదాహరించవలసి వుంటుంది. కొంత శ్రమపడ్డ తర్వాతనేనా రసంస్ఫురించే కవిత్వానికే నారికేళ పాకమనే పేరువర్తిస్తుంది కాని, యెంతో పరిశ్రమమీఁద అర్థమ్మట్టుకు తెలిసి అప్పుడు కూడా రసం కనపడని కవిత్వాన్ని నారికేళపాకంగా సహృదయులు భావింపరు. తత్సమపదాలే అక్కఱలేదు. అచ్చ తెలుఁగు పదాల కూర్పులోకూడా కొంత పెటుకుగా వుండే రచనలు వుండడం కలదు. యెక్కడ దాcకానో యెందుకు దీనికి వుదాహరణం “మూఁడు పంగల యీటె మోపినాఁడు" వగయిరా వాక్యాలు మనుచరిత్రనుంచే వుదాహరింపవచ్చును. ఆ మాటకంటె, తత్సమపదమైనా త్రిశూలం అని వాడుకుంటేనే హృద్యంగా వుంటుంది. కవి తనకు పదజాలం యెక్కువగా తెలుసుననే సంగతి లోకానికి తెలపడానికే అయితే నిఘంటును నిర్మిస్తే స్వాభిప్రాయం నెఱవేఱదా? (తే, గీ. తనకు నాల్గు నిఘంటుపదములు వచ్చుననుచు, చూ.) ఆఖరికి శుద్ధవ్యావహారిక భాషలో కవిత్వం చెప్పవలసిందని నీ తాత్పర్యమా? అని నన్ను మీరడుగుతారేమో! ఆలా అడగండి. వ్యవహారంలో నలిగే మాటలతో రచించడం మంచిదని నేను జవాబు చెపుతాను. వ్యవహారంలో కొంత సంస్కారశూన్యంగా వుండేమాటలు సంస్కరించుకొని వాడుకుంటే అవి గ్రాంథికభాషగా చెలామణీ అవుతాయి. కొంచెం వ్యాఖ్యానించి చూపుతాను. -

క. ఈలోకమయగుఁ గొందఱ
    కాలోకమకొందఱకు నిహంబును బరమున్
    మేలగుఁ గొందఱ కధిపా?
    యేలోకము లేదు సూవె? యిలఁగొందఱకున్

యీ పద్యంలో మాటలన్నీ పండిత పామర సాధారణ్యంగా లోకంలో అందఱూ వాడుకొనేవే. పద్యంలో పెట్టడం కొంచెం సంస్కరించి పెట్టడం జరిగింది. సంస్కరించని పూర్వం యీలా వుంటుంది. “కొంతమంది కేమో యీలోకమే సౌఖ్యకరంగా వుంటుంది.