పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/672

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

776

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వుంటుంది. సంగీతవిద్వాంసులలో వొక్క దీక్షితులవారి కవిత్వం మాత్రం కొంత పెటుకుగా కనపడుతుంది. ఈయన రచన సర్వమూ సంస్కృతమే. ఆకారణంచేత పెటుకనుకుందామా? ఆలాగేఅయితే జయదేవుని అష్టపదులకు యీదోషం తగలలేదే? (“సకురు నితంబని? గమన విలంబన మనుసర తం హృదయేశం" వగైరాలు చూ.) మొత్తం కవిత్వానికి మెఱుఁగు తెచ్చేది ప్రసాదగుణ మనిన్నీ ఆగుణం పదకవులలో విశేషించి కనపడుతుందనిన్నీ చెప్పినట్లయింది. అంతేకాదు ప్రసాదగుణానికి కారణం వ్యవహారంలోవుండే మాటలు తఱుచుగా వాడుకోవడమనిన్నీ చెప్పినట్లయింది. అయితే ఆపక్షంలో వ్యాకరణానికి స్వస్తిచెప్పవలసి వస్తుందేమో? అక్కఱలేదు. లోకోక్తుల మట్టుకు వ్యాకరణబాధ లేకుండా లాక్షణికులే శాసించారు. "లోకోక్తీనాం భవేద్యోగో యథా వచ్ఛ్రుతిరంజనమ్." యీలాగు అభ్యనుజ్ఞ నిచ్చినా కొందఱు లోకోక్తులలో వుండే వ్యాకరణ దోషాలను సవరించి వుపయోగిస్తూ వచ్చారు కాని, పింగళిమహాకవి యథాస్థితంగానే వాడుకున్నాఁడు.

(1) “రోళ్లా రోఁకళ్లంబాడిన కూరుము లిపుడింత దాcచికొన్న నడఁగునే?”

(2) నుయిదాఁటే వానికిన్ జింతయూకంతైనన్ గడమైననున్.

(3) పాలు విఱిఁగితే పెరుగగునే?

2-3 నెంబర్లు, రామలింగని కవిత్వమున్నూ సారంగుతమ్మయ్య కవిత్వమున్నూ అని యెఱుఁగుదురుగదా? 'విజయవిలాసకవి' చేమకూరకవి విజయవిలాసంలో కంటేకూడా సారంగధర చరిత్రలో లోకోక్తులెక్కువగా వుపయోగించాఁడు. విజయవిలాసంకంటే సారంగధర చరిత్రకే యెక్కువ పేరు వస్తుందని గ్రంథకర్త అభిప్రాయపడి వుంటాఁడని నావూహ. కాని యేకారణంచేతనో అలాజరుగలేదు. "చేమకూరపాకాన్ని పడింది” అన్న ప్రతిష్ఠ విజయవిలాసంవల్లనే కలిగిందని నాతాత్పర్యం. యిది విచారణాంతరం. లోకోక్తులంటే? వ్యావహారికపుమాటలన్నమాట. తఱచువ్యవహారం (కాస్తపరిశుద్ధమైనవారు వాడుకొనే దన్నమాట)లో నలిగేమాటలతో కవిత్వం చెప్ప గలిగితే అది పాఠకలోకాన్ని రంజింపఁగలిగినట్టు శాస్త్రాలు శోధించి దిద్దితీర్చి (శ్రౌత్రార్హంతీచణైర్గుణ్యైః-చూ.) రచించిన రచన కలది రంజింపఁజాలదు. కూచిమంచి తిమ్మకవిగారు ఆకాలపు రుచినిబట్టే అనుకుంటాను వొకసీసపద్యం,

“సీ. పరిలిపరి పీలుకర్బురపు రక్షణుఁడు."

అని కాఁబోలు అంతారాతిమయం అన్నట్లు రచించారు. చాలామంది దానికి అర్థం చెప్పవలసిందని అడుగుతూవుంటారు. కొందఱు చెప్పఁగలవారున్నూ వున్నారు. చిన్నప్పుడు