పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/669

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



773



అంతా రామమయం

యీ జగమంతా రామమయం. యీపదకవిత్వం యెవరిది? అంటే? భద్రాచల రామదాసుగారిదని ఆబాలగోపాలంగా అందఱూ యెఱిఁగిందే. దీన్ని మనం మన తెలుఁగు వ్యాకరణానుసారంగా గ్రాంథిక భాషలోకి మార్చుకుంటె– “అంతయు రామమయం, బీ జగమంతయు రామమయం!!" అని తేలుతుంది. కాని సహజమైన భాషలో యిచ్చినంత హాయి యీకృత్రిమ భాషలో వుండదు. పాడుకొనేవాళ్లు దీన్ని వాడవలసివస్తే గుఱ్ఱానికి కళ్లెం లాగిపట్టిన మాదిరిగా వుంటుంది. తుట్టతుదను విరమించినప్పుడు సున్నతో విరమించడం మాత్రం తప్పదు. అందుచేత వున్నదున్నట్టుగానే దీన్ని గానం చేయడంలోనే సుఖం కనపడుతుంది. గ్రాంథికంగా మార్చినప్పుడు గానానికి ఆనుకూల్యం పూర్తిగా లోపిస్తుంది. అందుచేతే అనుకుంటాను యీ రామదాసు మాత్రమే కాదు. త్యాగరాయలు కూడా యీ విధంగానే గేయాలు రచిస్తూ వచ్చారు.

(1) జగ మేలే పరమాత్మా? యెవరీతో మొఱలిడుదు.

(2) చక్కాని రాజామార్గము లుండఁగ సందులు దూరనేలనే వో మనసా?

ఆయీ గేయాలు యథాశాస్త్రంగా దిద్దవలసివస్తే చాలాపదడుగా పరిణమిస్తాయి. ఏల అనే అవ్యయం కళేగాని వ్యావహారికంలో సర్వత్రాద్రుతప్రకృతికంగానే కనపడుతుంది. గేయాలకు గ్రాంథికభాష వాడిన కవులు చాలా అరుదుగా కనపడతారు. అధ్యాత్మరామాయణకీర్తనలు రచించినకవిన్నీ మృత్యుంజయవిలాసం రచించిన కవిన్నీ గ్రాంథికభాషనే వుపయోగించారు. ఈపదకవిత్వంలో యెక్కడా వ్యావహారికం దొరలించనేలేదా ఆకవులు; అంటే వినండి, వారు గ్రాంథికంగా రచిద్దామని రచించారు. ఆంధ్రభాష మాతృభాష కావడంచేత చిన్నప్పటినుంచీ వాడుకొనే మాటలలోనే నేవేనా (బుద్ధిపూర్వకంగా కాదే అనుకోండి) కొన్ని దొర్లడం తప్పదు. ఈ పీడ పదకవిత్వం చెప్పేవారికే కాదు. పద్యకవులకున్నూ అనివార్యమే. నన్నయ తిక్కనాదులు వాడితే అవి “అనింద్య గ్రామ్యాలు" తదితరులు వాడితేనో? అవి నింద్య గ్రామ్యాలు. ఇంతే భేదం. శ్రీనాథుఁడెంతో గొప్పవాఁడై వుండిన్నీ కొన్ని గ్రామ్యాల వాడి వున్నాఁడు. (అఱువై, డెబ్బై, గొంతు గూరుచొని, వగయిరాలు చూ.) యే కవికేనా వంకలు పెట్టవలసి వస్తే తెలుఁగు మాటలలోనే తఱచు