పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/663

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వమూ-బ్రాహ్మణత్వమూ

767


(మాఘుఁడు వైశ్యుఁడని విద్వత్పరంపర చెపుతారు) కాని కవిత్వానికీ, పాండిత్యానికీ చుట్టఱికం అక్కఱలేదని యీశతాబ్దానికి పూర్వం తేలలేదు. చూడండీ, వొక్క రేఫశకటరేఫలను గూర్చి యెందఱు యెంతశ్రమచేశారోను. “ద్విరేఫదర్పణం” వగయిరాలు చూస్తే పై సంగతి తెలుస్తుంది. యిటీవల తెలుఁగుమీఱినకొలఁదిని యతిప్రాసలు, వ్యాకరణం వగయిరాలుకూడా అనావశ్యకా లన్నంత వఱకు వచ్చింది. అందుచేత యేదో గణబద్ధం చేసేమాత్రంలో వుండే వ్యక్తి మహాభారతకర్త వ్యాసులను పట్టుకొని తోఁచినట్లల్లా అనడం, యేవో కర్ణకటువైన ప్రతిజ్ఞలు చేయడం యీస్థితికి వచ్చింది యీనాఁడు కవిత్వం. తీరా యెదురుకుంటే “మాబావని కొట్టిచూడు" అనడానికే అధికారం గాని అంతకు మించి లేదు. ఆయీరకంవారితో కొందఱు వాదానికి వుపక్రమిస్తూన్నారు. అది శోచనీయం. ఆఖరికి "నాయబ్బజిజ్ఞాసా, నీతాతజిజ్ఞాసా" వలె పరిణమించింది. ఆఖరికేకాదు దానిదోరణి మొదటనే అట్టివాసన కొట్టింది. పెద్దలు అట్టివాదం పెట్టుకోరాదు. భవభూతి "ఘటానాం నిర్మాతు స్త్రిభువనవిధాతుశ్చకలహః" అన్నాఁడా లేదా? “భవే దద్యశ్వోవా కిమిహ బహునా పాపిని కలౌ" శాంతం పాపం. దాసు శ్రీరామకవిగారు “పున్నెమ? పూరుషార్థమ? బుభుక్షువు చేసిన బ్రాహ్మణార్థమా?" అన్నారు. కనక పెద్దలు యిట్టి వారితో వాదాలు పెట్టుకోవడం నాకు అభిమతం కాదని నమస్కార పూర్వక విజ్ఞప్తి. యే బాపతు ఐశ్వర్యంగాని వొకటే తెగని ఆశ్రయించి వుండదు. అందఱినీ సంతోషపెడుతూ వుంటుంది పర్యాయంగా; కొన్నాళ్లు దేవతలేలితే, కొన్నాళ్లు రాక్షసులు. అప్పుడు వారికి వీరు సలాం. ఇప్పుడో? వీరికి వారుసలాం యింతే ఐశ్వర్యప్రకృతి. మురారి యేమన్నాఁడు? - శ్లో. "కస్మైచిత్కపటాయ... నీచాన్నీచతరోపసర్పణ మపామేతత్కిమాచార్యకమ్" అన్నాఁడు. దీని తాత్పర్యం వ్రాయవలసివస్తే చాలా పెరుగుతుంది. చిరకాలం రావణున్ని ఆశ్రయించిన లక్ష్మి రాముణ్ణి (మనుష్యమాత్రుణ్ణి) ఆశ్రయించిందని ఫలితార్థం. వేదశాస్త్రాలను గూర్చి చెప్పలేనుగాని తక్కిన కవిత్వాదులు జాతిభేదంతో పనిలేకుండా అందఱికీ అలవడతాయనే నేను అనుకుంటాను. వేదానికీ, శాస్త్రానికీ వున్న బాధ లోఁగడ వుదాహరించే వున్నాను. పుస్తకాలు చూచి వేదం వర్లించినా అదిసక్రమమైన అభ్యాసం కాదు. దాన్ని శ్రుతి అనడంలోనే వుంది ఆ తాత్పర్యం. సంప్రదాయసిద్ధంగానిదీ యేవిద్యా ఫలించదు. కనక వేదమంటే మావంటి బ్రాహ్మణబ్రువులకు భయం. దాని అంగాలన్నా (వ్యాకరణాదులు) అంతే. జర్మనీలో వేదార్థం తెలిసినవా రున్నారంటారే; వున్నమాట నిజమే. వారికీ ఉచ్చారణ కుదరదు. వారికే కాదు. దశవిధ బ్రాహ్మణులలో యెందఱికో కుదరదు, ఆంధ్రులకూ ద్రావిడులకూ మాత్రమే యీమహాభాగ్యం. వీరు వేదం పఠిస్తూ వుంటే తక్కిన అష్టవిధ బ్రాహ్మణులూ చాలా ఆప్యాయనంగా విని ఆనందిస్తారు. యిఁక ముందేనా వేదానికి ఆంధ్రులూ