పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/66

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


తప్పకపోవడంచేత తద్ద్వారాగా వచ్చే పాతకాన్ని కూడా చెటిసగం తామే భరింపవలసి వుంటుంది. కనుక మొత్తం వీట్లనన్నిటినీ కల్పి వైశ్వదేవమనే పుణ్యకర్మద్వారా నివర్తింప చేసుకొన్నట్టయిందనుకోవాలి. బాహ్యదృష్ట్యా వైశ్వదేవానికి ఫలితం యిదే అయినప్పటికి అంతర్దృష్టినిపట్టి చూస్తే యేజంతువునకు గాని హానిలేకుండా వర్తించరా, పెళ్లికొడకా? అని ప్రతి మనిషికిన్నీ భగవంతుఁడు విధించినట్టు తేలుతుంది. యిట్టిస్థితిలో ప్రస్తుతం నన్నుపీడిస్తూ వున్న యొలకలకున్నూ పందికొక్కులకున్నూ యేం చేయడానికిన్నీ మన మతరీత్యా వుపాయాంతరం కనపడడంలేదు. యథేష్టంగా తిని మదించి రాత్రి తెల్లవారూ పందికొక్కులుచేసే అల్లరికి పరిమితే కనపడడంలేదు. పందికొక్కును చంపితే పైజన్మానికి వుబ్బసం తగులుకుంటుందంటూ పెద్దలు చెపుతారు. దానికి తథ్యంగా యీ మధ్య మా వూల్లో వక సంపన్నగృహస్టు కొన్ని పందికొక్కులని విధిలేక చొరవచేసి చంపించి, చంపించిన కొద్ది రోజుల్లోనే లేదు లేదన్నంతవఱకూ జబ్బుపడి భగవదనుగ్రహంవల్ల మనుష్యలోకంలోకి యిప్పడిప్పుడే వస్తూవస్తూ వుండడం చూస్తే, వాట్ల అధికారం సాగకుండా యేదోవుపాయం చూచుకోవలసిందే కాని వాటిజోలికి వెళ్లడానికి లేశమున్నూ మనకు అధికారం వున్నట్టే బొత్తిగా కనపడదు. వుపాయమల్లా కిటికీలకుగాలి తక్కువ వస్తే వచ్చిందని చెప్పి యేయినపతీంగెలో బెత్తాయించుకోవడం వగైరా. కొట్లు వడ్లు పోసేవి కుచేలుండి బట్టలలాగ తయారైనాయి. వాట్లగతి యీ యేంటికి యేంచేయాలో ఆలోచన పాలుపోవడంలేదు. యీ బాధ అందరికీ వుండేదే. దీన్ని గూర్చి యింతగా వ్రాయడం లోకజ్ఞాన శూన్యత్వానికి గుఱు తనుకోవడానికి తప్ప మటౌకందుకు కాదని కొందరంటారని నేను యెటింగినిన్నీ తీరికూర్చుని దీన్ని వ్రాశాను. యితరులు వీట్లవల్ల యింతటి బాధపడుతూవున్నవాళ్లు లేరనియ్యేవే, అథవా వుంటే వుంటారుకాక, అంతమాత్రంచేత నాబాధ తీరడం యేలాగ? దీనివల్ల నేను నేర్చుకున్న పాఠమేమిటంటే? ఆర్యమతంకంటే ఉత్తమమైన మతమైతే లేదుగాని ఆ మతంలోవుండి ఆ మతధర్మాలు నెఱవేర్చుకోవాలంటే చాలా దుస్తరం, ఆ చేదస్తంలో వుండేవాణ్ణి. అంతో యింతో జ్ఞానం వుండే మనుష్యుల మాటట్లా వుండంగా జ్ఞానంలేని తిర్యగ్డంతువులుకూడా లోంకువచేసి బాధిస్తాయనేదియ్యేవే. నిత్యమున్నూ జంతుహింస చేస్తేనే కాని పొట్ట గడవనివాళ్లేందతో వున్నారు. వాళ్లందఱూ పిల్లాజెల్లా దోసతోcటలాగ వృద్ధిగానే వుంటారు. యేం కర్మమో! యెన్నఁడూ చేయనివాళ్లు కనక యెప్పడేనా ఆఖరికి యేతేలునో యేపామునో చంపడమంటూ తటస్థిస్తే అది వాళ్లకి యెల్లప్పుడూ మనస్సును పట్టి పీడిస్తూనే వుంటుంది. మొత్తం భారతాది గ్రంథాలన్నీ యీ వుద్దేశంతోనే చాలావఱకు ప్రవర్తించాయి. కాని సర్పయాగాది క్రూరకృత్యాలుమాత్రం కోపం తీర్చుకొనే అభిప్రాయంతో ఆరంభించడం మాత్రం సూచిస్తూ వచ్చాయి. దుష్టజంతుమారణంవల్ల లోకానికి యెంతో వుపకారం వుందని యెటింగిన్నీ మహరులు ఆ మారణంవల్ల ఆజాతి అసలేలాగా నశించదని