పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/659

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వమూ-బ్రాహ్మణత్వమూ

763


కారని అద్వైతపు బాలుఁడెవరేనా ప్రసంగిస్తే యేంలాభం? దేశికులకాలంలోవున్న పండితులు లేదా పండితుఁడు “ఇదుగో నేను శాంకరమతంవాణ్ణి. నన్ను జయించుచూదాం. అప్పుడు నీయెడంకాలు నీవు పెట్టనక్కఱలేదు. నీకంత శ్రమెందుకు, నేనే నా నెత్తిమీఁద పెట్టుకుంటాను" అని యెదిరిస్తే యేదో జరుగుతుంది. అంతేకాని ఆకాలం గతించాక “నన్ను కొడితే యేంలాభం, మాబావని కొట్టిచూడు" అన్నట్టు వాగ్వ్యయం చేయడం మొదలెడితే యేంప్రయోజనం? యేదో పొరcబాటో, తొందరపాటో ఆ వాగ్వ్యయానికి కారణమనుకుందాం. విద్యావయోవృద్దులు క్షేమంకోరిన వారు "నాయనా, నీత్రోవ సరియైనదికాదు. వేదాంతదేశికుల ప్రతిజ్ఞ శంకరులకు సమన్వయింపదు. కాలంవేఱు” అనిబోధిస్తే వారిని పట్టుకొని తిట్టడం, తలకు తగని డాంబికాలు పలకడం, ఇదంతా క్షంతవ్యంకాదు. వేదాంత దేశికులవారి ప్రతిజ్ఞకు తగిన కారణం ఆకాలంలో వుండకపోదు. దేశికులు శ్రీమహావిష్ణువు యొక్క ఘంటయొక్క అవతారమని ఆమతస్థులు విశ్వసిస్తారు. కవితార్మిక సింహుఁడు అనే ఈ పేరున్నూ, వేదాంతదేశికులు అనే పేరున్నూ ఆయనకు వాడతారుగాని అసలు తలిదండ్రులు పెట్టిన పేరు యెవరూ వాడరు.

శ్లో. కవితార్కికసింహాయ కళ్యాణ గుణశాలినే
    శ్రీమతే వేంకటేశాయ వేదాంతగురవే నమః.

ఆయీ శ్లోకంవల్ల ఆయనపేరు తెల్పినట్లయింది. ఆలాటి మహానుభావుని కాలు నెత్తిమీఁదకు రావడం అదృష్టమేకాని యెందుకూ కొఱగాని వాదాలు చేయువారిని మందలించడం కూడా పాపమే. - -

తెలుఁగుకవులలో రామలింగం ముష్కరుఁడుగా అతని కొన్నిపద్యాలు (తెలియనివన్ని తప్పులని - ఒకనికవిత్వమం దెనయు నొప్పులుఁదప్పులు, వగయిరా) తెల్పుడు చేసినా అతఁడు శ్రీవైష్ణవభక్తుఁడని అతని పాండురంగ మాహాత్మ్యం ఋజువు చేస్తుంది. ఆలాగే ఆయీ దేశికులవారు లోఁగడ వుదాహరించిన ప్రతిజ్ఞాశ్లోకభాగంవల్ల దుర్వాస మహాముని మాదిరిగా కనపడినా ఆశ్లోకపూర్వార్ధం చూస్తే రెండవ తొండరడిప్పొడి యాళ్వారుగా తోఁపకమానరు. చూడండి- -

“శ్లో. యతీశ్వరసరస్వతీ సురభితాశయానాం సతాం,
     వహామి చరణాంబుజం ప్రణతిశాలినా మౌళినా"

చూడండీ, యెంత విషయం వుందోను? “యెవరు శ్రీరామానుజుల వారి వాక్యములను ఆదరించి వర్తించు మహాభక్తులో వారి పాదమును వంచిన తలమీఁద పెట్టుకుంటాను" అనికదా దానిభావము. మహాపురుషుల ప్రకృతిలో పరస్పర విరుద్ధధర్మాలు