పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/653

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వమూ-బ్రాహ్మణత్వమూ

757

అస లుపక్రమించిన విషయంవేఱు. బ్రాహ్మణ్యానికీ, కవిత్వానికీ లంకెగా యెవరేనా చెప్పడానికి పూనుకుంటే ఆమాట అపహాస్యాస్పదమేనా, కాదా అనేది. అప్పకవికి కొద్ది గొప్ప యీ పిచ్చి అభిప్రాయం వున్నట్టు అతని వ్రాఁత కొంత సాక్ష్య మిస్తుంది. విశ్వకర్మజాతిలో త్రాసులు, బంగారుతూఁచుకొనేవి, చేసే కుటుంబాలుకొన్ని తునివద్ద యేదో వూళ్లో వుండేవి. ఆ కుటుంబస్థులు ఆ శిల్పం తమ కూఁతుళ్ల కొడుకులు చూస్తూవుంటే చేసేవారు కారు. ఆలాగే వైద్యులు కొందఱు కొన్ని ఔషధాలు భద్రంగా కాపాడేవారు. ఆలాగే కొన్ని మామిడిజాతులున్నూ. (జహంగీరు ఇమాన్ పసందు పద్యం చూ.) తుదకు యివన్నీ వారువారు అనుకున్నట్లు తమలోనే వుండక అంతటా వ్యాపించాయి. ఆలాగే కవిత్వమూ యిప్పుడు ఆబాలగోపాలమూ ఆబ్రహ్మస్తంబ పర్యంతమూ (తెలుఁగన్నమాట) వ్యాపించింది. శ్రీనాథుఁడు “నీవునుంగవివి గావుగదా?" అన్నాఁడని ఒక వినికిడి కలదు. దీన్నిబట్టిచూచినా బ్రాహ్మణులలోనే కాక యీ కవిత్వం సర్వత్రా వ్యాపించి పూర్వమున్నూ వుండేదని తెలుస్తుంది. అది విద్వత్కవిత్వమా, కాదా అన్నది విచారణాంతరం. గంభీరహృదయులు తేలిక ప్రసంగాలు యెన్నఁటికీ చేయరు. చేసేవాళ్లను ఆమోదించరు. గాని లఘుహృదయులు జాతినియెత్తిపొడవడం పూర్వమూ వుండేది. వాసిరెడ్డివారి సంస్థానంలో బుచ్చివెంకు అనే కళావంతుఁడు వుండేవాఁడు. అతణ్ణి బ్రాహ్మణకవులు-

క. “ఈ-న్యంకేల? వానికింగల
    రంకే యచ్చోట నిలుప రసవంతమగున్"

అని (పాపం) కులాచారాన్ని పురస్కరించుకొని శ్లేషించేటప్పటికి ఆకవి ఒళ్లు మండి “ఊరకే మన్నన మాలి మాకొలము మాట దలంతురు" అని చక్కని జవాబు చెప్పినట్లు వినికిడి. ఆజవాబు చెప్పడంలో “చేమకూర వెంకన్నకు లోపమేమి?" అని విజయవిలాస గ్రంథకర్తని స్పృశించడం చేతనే చేమకూర మహాకవి లక్ష్మణామాత్య తనూభవుఁడే కాని బ్రాహ్మణుఁడు మాత్రం కాఁడని తెలియవచ్చింది. ముప్పది యిద్దఱు నియోగుల సీసంలో యితఁడున్నాఁడు. యితఁడు గ్రంథాంత గద్యంలో గోడమీఁదిపిల్లి వాటంగా ప్రవర్తించాcడు. తండ్రికి అమాత్యపదం వాడి తనకు వాడుకోలేదు. (యిప్పుడయితే వాడుకొనేవాఁడే) యిటీవల, బుచ్చివెంకుకూ, బ్రాహ్మణకవులకూ జరిగిన వివాదవల్ల యథార్థం బైటఁబడింది. బుచ్చివెంకు అన్నట్లు – “పన్నిన సత్ప్రబంధమున బాగును నోగును జూడ" వలయును గాని "నీవు బ్రాహ్మఁడవు, విశ్వబ్రాహ్మఁడవు, నియోగివి, వైదికివి, వైశ్యుఁడవు, క్షత్రియుడఁవు, కమ్మవు, కాపవు, బల్జీవి, మాలవు-ఆఁడుదానవు" అంటూ వివదించడంకన్న శోచ్యస్థితి వుండదు. (భిక్షుణాకక్షనిక్షిప్తః కిమిక్షు ర్నీరసో భవేత్) యెవరో లఘుహృదయు లిట్టి కలహాలకు