పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/650

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

754

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

యిటీవల లక్షణనిర్వచనం అతివ్యాప్త్యాదిదోషదూషితంగా పాడయిందిగాని పూర్వలాక్షణికు లేర్పఱచింది చూడండీ యెంత చక్కగా వుందోను :

శ్లో. శక్తి ర్నిపుణతా లోకశాస్త్రకావ్యాద్యవేక్షణాత్
     కావ్యజ్ఞ శిక్షయాభ్యాస ఇతి హేతు స్తదుద్భవే.

ఇందులో కులాలప్రసక్తిలేదు. శాస్త్రపదం వున్నా అదివుంటే విద్వత్కవి అనిపించుకుంటాఁడు, లేకపోతే “శుద్ధసురన్నది రుద్రరూపమై" మాదిరిని రచించే కవి అనిపించుకుంటాఁడు, పూర్వం కవిత్వం చెప్పేవాళ్ళకు భాషాపాండిత్యం ఆవశ్యకంగా వుండేది గాని యిపుడు నవ్యసాహిత్య పరిషత్తు ఆపీడ వదిల్చింది. కాని హరిజనకవులు చెప్పే కవిత్వాలు నిర్దుష్ట భాషలోనే కనపడుతూ వున్నాయి. నేను ప్రత్యక్షంగా కొన్ని కవిత్వాలు చూచే యీమాట వ్రాస్తున్నాను. అందఱికీ అందుబాటు శైలిలో లేవనేకారణంచేతనే కదా యిప్పుడు చాలామందికవులు భారతాదులను నిరసిస్తూన్నారు. యీ నిరసించడం యింకా పూర్తిగా లోకామోదాన్ని పొందినట్లు లేదుగాని పొందినవెంటనే యెవరో వొకరు క్రొత్తశైలిలో వ్రాయనే వ్రాస్తారు. యిప్పుడు మనకు ముఖ్యంగా విచారించుకోఁదగ్గది కవిత్వానికీ బ్రాహ్మణ్యానికీ సంబంధం వుందా అనేదే. అట్టిసంబంధం లేదనే యెన్నో సందర్భాలు తెల్పుడు చేస్తున్నాయి. కవిత్వం రచించేవారిలో నూటికి తొంభైమందికి (బ్రాహ్మణులలోనే) శాస్త్రం చదువుకున్నా బుఱ్ఱకెక్కదు. కాళిదాసంతవాఁడు. “శ్లో. నమఃప్రామాణ్యవాదాయ మత్కవిత్వాపహారిణే" అని వొక్కదండం పెట్టి మానుకున్నాఁడని విద్వత్పరంపర చెప్పుకుంటుంది. భార్య కాపరానికి వచ్చాక చదువేలా సాఁగదో, అదేవిధంగా కవితారచనలోకి దిగి వెఱ్ఱోమొఱ్ఱో గిలుకుతూవుంటే శాస్త్రాభ్యాసమున్నూ సాగఁదు. అసలు దాని (శాస్త్రం)లో ప్రవేశమంటూ అయితే యేదోకొంత ఆర్జించ వీలవుతుంది గాని అది “అనభ్యాసే విషం శాస్త్ర మజీర్ణే భోజనం విషమ్.” అన్ని శ్లోకానికి వుదాహరణంగా పరిణమింపచేస్తుంది. అందుచేత యీరెంటికీ సామానాధికరణ్యం కుదరదు. విద్వత్త అభ్యాససాధ్యమనిన్నీ కవిత్వం జన్మతో పట్టుకవచ్చేదనిన్నీ అందఱూ యెఱిఁగిందే. కనక యిందులో రెండోదానికి జాత్యాదులతో ఆవశ్యకత లేదు. బ్రాహ్మణేతరులకు తర్క వ్యాకరణాది శాస్త్రాలు అభ్యాసంవల్లకూడా సాధ్యపడవా అంటారేమో? సాధ్యపడవనే చెప్పవలసివస్తుంది. దానికి తథ్యంగా బ్రాహ్మణేతరులలో కవులే కనపడుతున్నారు గాని శాస్త్రజ్ఞులు కనపడడంలేదు. శాస్త్రజ్ఞత్వ మనఁగా శిష్యులకు పాఠాలుచెప్పే శక్తిగాని, అల్లాటప్పా ప్రవేశం కాదు. ఒక బ్రాహ్మఁడు పదిపండ్రెండేళ్లు వ్యాకరణం చదివి కాశీనుంచి వచ్చి “ప్రత్యాహారే ష్వితాం నగ్రహణం, అనునాసిక ఇత్యాది నిర్దేశాత్" అనే వాక్యానికి అర్థం తెలియనే