పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/649

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వమూ-బ్రాహ్మణత్వమూ

753


యేవిధంచేత చూచినా కవి ధరణీసురుఁడుగానే వుండాలనే లక్షణనిర్వచనం యుక్తంగా కనపడదు. ఆ విశేషణం మాత్రమే కాదు “ప్రశాంతుఁడు" అనేది కూడా బాధించేదే. కవులు వేములవాడ భీమకవి వగయిరాలు శాంతులుగారు.

“చ. గరళపుముద్దలోహ మవగాఢ మహాశనికోట్లు సమ్మెటల్
     హరునయనాగ్ని కొల్మి యురగాధిపు కోరలు పట్టుకార్లు ది
     క్కరటి శిరంబు దాయి లయ కాలుఁడు కమ్మరి వైరివీర సం
     హరణగుణాభిరాముఁడగు మైలము భీమన ఖడ్గసృష్టికిన్"

భీమకవిగారి యింటిపేరు మైలమువారే అనియు, వేములవాడ అనేది నివసించే గ్రామాన్ని బట్టి నచ్చిన పేరనిన్నీ తెల్విడి. ఆయీ వేములవాడ నైజాంమండలంలోనూ ఉంది, గోదావరి జిల్లాలోనూ ద్రాక్షారామ దాపున వుంది. భీమకవి అక్కడివాఁడా యిక్కడివాఁడా అనే చర్చ లోఁగడ చాలామంది చేసి విరమించారు. ప్రస్తుతం మనక్కావలసింది భీమన ప్రశాంతుఁడేనా అనేదే.

“ఉ. పెండెలనాగి చెక్కులను ... రామకవి కుంజరు హస్తము ...
     యీకసుమాల ధారుణీమండలనాథుcబోలు ... ... ... ..."
                                                          (ఇది తురగావారిది.)

అప్పకవినిర్వచనం అతివ్యాప్త్యాదిదోషగ్రస్త మవడమట్లుండఁగా అహోబల పండితుఁడు వుదాహరించిన "సత్కులీన శ్శుచి ర్దక్ష" అనే దానిలోవున్న సత్కులీన విశేషణార్ధాన్ని కూడా కవిత్వం అపేక్షిస్తుందని నియతంగా చెప్పడం పొసఁగదు. పదకవిత్వమో, పద్యకవిత్వమో, జంగంకథలు వగైరాలో అల్లేవాళ్లు చిరకాలాన్నుంచి వున్నట్లే ఆయారచనలు సాక్ష్యం యిస్తాయి. కులాభిమానప్రయుక్తమైన పోట్లాటలు కాపులకీ, బ్రాహ్మలకీ వున్నాయంటే, ఆవివాదాలు బ్రాహ్మలలో బ్రాహ్మలకే శాఖాభేదప్రయుక్తంగా కనపడుతూ వున్నప్పుడు జాత్యంతరులతో వుంటే ఆశ్చర్యమేమిటి? వైదికులకీ, నియోగులకీ మళ్లా వారిలో అవాంతరులకీ యీదురభిమానాలు వుంటూనే వున్నాయి. ఆయీ పోట్లాటలకి జంకి కవిత్వం బ్రాహ్మలనే కాని అన్యులనే కాని ఆశ్రయించి, యితరులను అస్పృశ్యులనుగా భావించి నిరసిస్తుందనడానికి యేప్రాజ్ఞుఁడూ సమ్మతింపఁడు. కవిత్వమూ గానమూ యివి వొకరి సొత్తులు గావు, అందఱివీని. సహజంగా పుట్టేవి. "శ్లో గాంధర్వంచ కవిత్వంచ. సహజా గుణాః" వేశ్యజాతిలో కన్న మిన్నగా భాంవేషం వినిపించే పాత్రలు కడజాతిలో వున్నారు. యిప్పుడే కాదు కృతయుగంలోకూడా యీఅంశాన్ని ధ్రువపఱచాలంటే హరిశ్చంద్రోపాఖ్యానం తోడ్పడుతుంది. వేశ్యజాతిలో స్త్రీలూ పురుషులూ మహాకవులే వున్నారుగదా?