పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


పెద్దపులిని చంపి యేదేనా యజ్ఞంలో హోమం చేయవలసిన దని విధించేయొడల దానికి తగు సాధనసామగ్రిమాత్రం శ్రాతులు సిద్ధం చేసుకోలేకపోతారా? వేదంలో యేలావుందో ఆలాగే జరుపుకోవడంకన్న వేటేగత్యంతరం లేదని దానికి సంబంధించిన మీమాంస చెపుతూనేవుంది. అందుచేత ఆ హేయమైన దాసీ బ్రహ్మచారిసమాగమాన్ని నిషేధిస్తే ఆక్రతువు నెఱవేఱదని వొప్పి తీరవలసిందే. పాపం! ఆ దంపతులు ఆ క్రీడాగృహాన్నుంచి యీవలికివచ్చి అందు కేర్పడ్డ దక్షిణతాంబూలాది సత్కారాలతో నిర్గమిస్తూ వుండంగా వారిమీద గోమయోదక సేచనం వగయిరా మర్యాదలు జరుపుతారనికూడా వినడం. అన్నింటికంటే కూడా యీ జంట ధనంకోసం అంగీకరించడం చూస్తే దానికిమించిన దేదిన్నీ లేదని తేలుతుంది. దీనికేంగాని యెంతసరిపెట్టుకుందా మన్నాయినా లజ్ఞాకరమైన కృత్యాన్ని కూడా పరమపవిత్రమైన యజ్ఞములో చేర్చుకోవడానికి వేదార్థ వేత్తలు యేలాసమ్మతించారో అది దురూహంగానే వుంటుంది. వెధవ యొలకలగోలలో నుంచి పెద్దపెద్ద క్రతువుల విషయంలోకి పాంకింది మన వుపన్యాసం. యేమీ? యెందుకు పాంకకూడదంటాను. ఎలకేలాటి జీవమో, మేంకా ఆలాటిజీవమేకదా! మేం కదాంకా యెందుకు? దోమమాటచూడండీ దానిశరీరమెంతో, దానిలో ఉదరభాగ మెంతో, దానిలో వాయువు పుట్టడాని కవకాశ మెంతవుంటుందో, ఆ అవకాశంలోన్నుంచి యేమాత్రంధ్వని పుట్టడానికి వీలుందో ఆలోచించండి! భగవద్విలాసం అనిర్వచనీయం కాకపోతే ఆస్వల్ప జంతువుగర్భంలోన్నుంచి వకవిధమైన - అతిసూక్ష్మమైన సున్నితమైన నాదం శ్రావ్యమైనదే వినపడుతుందిగదా! దీన్ని గుఱించి యే మనుకోవలసి వుంటుంది? (అణోరణీయాన్) అంత శ్రావ్యంగా గానం చేస్తూ చెవిదగ్గఱ నాట్యంచేసే దోమలెన్నో మనచేత చంపఁబడుతూనే వున్నాయి. కాని మన ఆర్యులమతంలో యజ్ఞంలో చంపCబడే పశువుల విషయంలోనే గత్యంతరం కనపడదుగాని యీలాటివాట్లకు వైశ్వదేవమంటూ వొకటి నివారకం కనపడుతుంది. యజ్ఞంలో కావాలని బుద్ధిపూర్వకంగా చేసే పశుహింసను మనవారు హింసలోనే చేర్చలేదు. అక్కఱలేదనుకున్నా తప్పని హింస దోమలు వగైరాలది. నిజమైన అహింసాతత్త్వం అంటే జైనులలో కనపడుతుంది. ఆ మతస్టులు ప్రొద్దుగుంకేలోపునే భోంచేయడంకూడా హింసకు జంకియ్యేవే. సర్వబాధకమైన తేలునుగాని పామునుగాని చంపడానికికూడా ఆమతస్థుండు లేశమున్నూ అంగీకరించండు. అహింసా నిర్వహణంకోసం దంతధావనాది కృత్యాలుకూడా మానిన సన్యాసులు ఆమతంలో వుంటున్నారన్నది ప్రసిద్ధమే. వారు మలినవస్తాలను పరిహరించడమేకాని నీటితో వుతకడంకూడా వుండదు. ఆలావతికేటప్పుడు కొన్నిసూక్ష్మ జంతువులకు హానికలుగుతుందనియ్యేవే. యేవో పూర్వ పక్షాలుచేసి ΟΣΟΦ మతాన్ని మన ఆర్యమతాలవారు ఖండిస్తే ఖడించనియ్యండికాని అహింసాపరమోధర్మ అనే వాక్యాన్ని పట్టి నడిచేవారంటే? వారే కాని మనఆర్యులు