పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/639

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నీ కవిత్వాలేనా?

743

యీ పద్యం శిష్యుఁడు ప్రకటించిన ఆరుపద్యాలలోను అయిదోది. యిందులో యోగశాస్త్రం కొంతవుంది. చట్టన తాత్పర్యం గోచరించదేమో. అందుచేత ముందుగా వుదాహరించాను. కవికి కల్గినబాధను యిది తెలుపుడుచేస్తుంది. యీపద్యంకూడా రసవంతమే అయినా నేను యెత్తినపీఠికలోని అంశాలను సమర్ధించడానికి యిది చాలదు. యీ పద్యాలు చదివి చూడండి.

మ. ఒక బిల్వార్చనయేని వీఁడెఱుఁగునో? ఒక్కొక్కటే యొంటిమీ
     దికి నిన్నేఁడులు వచ్చి యొక్క శివరాత్రిగాని వీఁడుండెనో
     మొక మేలాగునఁ జెల్లి వాదెఱచెడిన్ మోక్షమ్ము నిమ్మంచు నేఁ
     టికి నామ్రొక్కినమ్రొక్కె చాలు ననుకొంటే తప్ప మృత్యుంజయా,

యీ పద్యం మొట్టమొదటిది. దీనిలోవున్న స్వారస్యాన్ని వివరించవలసివస్తే యీకాగితాల కఱవుదినాలలో యేపత్రిక భరిస్తుంది. రేషనింగు కంట్రోలు రోజులివి. కడుపునిండా తిండీ, ప్రస్సునిండా కాగితాలూ వున్న రోజుల్లో అయితే బాగుండేది. శాంతం పాపం-ప్రతిహత మమంగళం-ప్రకృత మనుసరామః

“ఏకబిల్వదానతో౽పి | తోషిణే నమశ్శివాయ
 స్తోకభక్తితో౽పి భక్త 1 పోషిణే నమశ్శివాయ.

పైవాక్యాలు శ్రీశంకరాచార్యులవారివి, నమ్మికగలవారిపట్ల మృత్యుంజయ స్తవము పనిచేయుటకు సంశయంలేదు. నేను ఆ యీ స్తవమువల్లనే వార్ధక్యమును కొంతసుళువుగా నెట్టుచున్నాను. “కవనార్ధంబుదయించితిన్. మృత్యువు జయింతున్ దానిచేన్” అని నే వ్రాయగల్గితిని. తప్పక శివస్తవము పనిచేసి తీరును. ఇది నే ననుభవించి వ్రాసెడిమాట. శిష్యుఁడు సోమరి యయ్యు నన్ననుసరించుట శ్రేయస్కరము. మృత్యుంజయుఁడు వీని ననుగ్రహించి సుఖిగాచేసి వీనిచే పెక్కు మహాకావ్యములు రచింపించుఁగాక. దీనితాత పద్య మింకొకటి చూపుతాను.

మ. ఒక లంబోదరుఁడైన పుత్రకుఁడు మున్నున్నట్టిదే నీకుఁ జా
     లక కాఁబోలును సృష్టిఁ జేసితివి యీలంబోదరుంగూడఁ దీఁ
     గకుఁ గాయల్ బరువౌన కాని కుడుముల్ గల్పించి యవ్వాని కే
     లొకొ? యివ్వానికి నొక్కమైని యిడుమల్ మొల్పింతు మృత్యుంజయా.

యీపద్యంలో వున్న చమత్కారం కవి నెప్పుడేనా చూచివుంటేనే కాని సుగమం కాదు. లంబోదర పదం వాడుకోతగ్గంత స్థూలకాయుఁడు కాఁడుగాని మొత్తంమీఁద