పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/630

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

734రచయితలు

వీరినిగూర్చి కొంచెం వ్రాస్తాను. రచనచేసేవారు రచయిత లనిపించుకుంటారు. రచనా శబ్దార్థము క్రియామాత్రానికి (ప్రతీ పనికీ) వర్తిస్తుందిగాని, యోగరూఢిచే మాత్రము కవిత్వం చెప్పడానికే గాని యితరానికి అనువర్తించదు. కావ్యం అంటే కూడా కవిచేసిన శబ్దరూప రచనకే అనువర్తించడం ఆ యీ యోగరూఢి చేతనే. అయితే, యోగరూఢి అంటే యేమిటి అని ప్రశ్న వస్తుంది. అసలు శబ్దాలు యావత్తూ మూడు విధాలు : యౌగికాలు, రూఢాలు, యోగరూఢాలు - అనే యీ మూడిటిలో చాలా భాగం రూఢాలుగానే చెలామణీ అవుతాయి. రూఢాలు అవయవార్థంలేనివి. డిద్ధుడు, విద్ధుడు, డబిద్దుడు, అన్న, బల్ల, పుల్ల, కల్ల, చల్ల, చెప్పు, కప్ప, అప్ప, పప్ప, చొప్ప, జొన్న, చిన్న, దున్న, వెన్న... మొదలైనవి. ఇవన్నీ రూఢములే. యిందులో మొదటి మూడుమాత్రం తత్సమాలు. తక్కినవన్నీ దేశ్యాలు (దేశస్థులు అనాదిగా వాడుకొనుచున్నవి) దున్న అనేదానికి అవయవార్ధం (వ్యుత్పత్తి) చెప్పడానికి కొందఱు స్థూలదృష్టులైతే ప్రయత్నిస్తారు (దుక్కి దున్నడానికి వుపకరించే జంతువు) గాని, అది నిలవదు. దుక్కిదున్నడం దున్నపోతులతో పాటుగా గాని, అంతకంటే అధికంగాకూడా గాని యెడ్లుకూడా చేస్తూవున్నాయి కనక, ఆయీ వ్యుత్పత్తి అతివ్యాప్తిదోష దూషిత మైపోయింది.

ఇక యోగరూఢాలను గూర్చి కొంచెం వ్రాసి ప్రధానాంశానికి వస్తాను. యోగం అంటే అవయవార్థం అదికనపడుతూవున్న రూఢశబ్దాలు. అనగా వ్యవహారంలో వున్న శబ్దాలు, ఆ వ్యవహారం పండితుల దేనాసరే, పామరులదేనాసరే, మోఱకులం మాకేం తెలుస్తందడీనీ?" అన్నాడు ఒక పాలికాపు అంతేవాసి, యీ 'మోఱకు' శబ్దం మూర్థశబ్ద భవంకనక, తద్భవం, రామ్యుడు. వాడినా గ్రామ్యంకాదు. దేశ్యమంతకు ముందేకాదు. యెందుకు కాదంటే, చాలా వ్రాయాలి. అది ప్రస్తుతంకాదు.

రచన చేసేవారందఱూ రచయితలే, ఆరచన గురుముఖతః అభ్యసించిన గీర్వాణ, లేదా, ఆంగ్లం లోనైన యేభాషలలో నేనా కావచ్చును. యద్వా, పుట్టుకపిమ్మట కొద్ది మాసాలలో (అత్త, తాత, వగైరా) శ్రవణతః సునాయాసంగా అలవడే మాతృభాషలో నేనా సరే, దేన్నిగుఱించైనా కొన్ని పద్యాలో, గద్యలో రచనచేస్తే ఆ వ్యక్తిని ‘రచయిత' అని వ్యవహరిస్తారు. క్రియలోమాట, రచయితృశబ్దం కవికి పర్యాయపదంగా పరిణమించి