పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/626

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

730

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

యెన్నని వుదాహరించేది? యీ ఘట్టం యావత్తూ చాలా మందికి వచ్చేవుంటుంది. భీష్మస్తవంలోవుండే -

సీ. కుప్పించి యెగసిన గుండలంబులకాంతి. తెరలిచనుదెంచు దేవుండు దిక్కునాకు. వగయిరాలు రానివారెవరు?

"ఉ. ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలోపలనుండు ... ..."

వగయిరా గజేంద్రమోక్షం రాని అక్షరాస్యులున్నారా? వీట్లదాఁకా యెందుకు? అసలు గ్రంథారంభంలోవున్న-

తే.గీ. చేతులారంగ శివునిఁబూజింపఁడేని, ... ...

ఆయీ గీతంలో యావత్తు భాగవతరహస్యమూ యిమిడింది. "అమ్మలఁగన్నయమ్మ" పద్యాన్ని చెప్పనే అక్కఱలేదు.

సీ. కమనీయభూమిభాగములు లేకున్నవే? . . . . . .
    ధనమదాంధులకొలువేల? తాపసులకు.

“క. ఇందుఁగలఁ డందులేఁడని"

“ఉ. అచ్చపుఁ జీఁకటింబడి"

“మ. కలఁడాకాశమునందు"

“శా. బాలుండీతఁడు కొండదొడ్డది, ... నాకేలల్లాడదు"

ఆ యీ పద్యాలు వోనమాలు వచ్చినవారందఱికీ జిహ్వాగ్రమందే వుంటాయి.

"ఉ. నల్లనివాఁడు . . . . . . . . . . . .
      మల్లియలార! మీ దరికిరాఁడుగదా? కృపనుంచి చెప్పరే?"

“ఉ. అంగజునైనఁగాని ... ... ... ... లవంగలుంగనా
     రంగములార! మీ దరికిరాఁడుగదా? కృపనుంచి చెప్పరే?”

సీ. వీcడఁటే? నందుని వెలఁదికి జగమెల్ల
              మొగమందుఁ జూపిన ముద్దులాఁడు"

చ. నగుమొగమున్ సుమధ్యమును నల్లని మేనును లచ్చి కాట ప
    ట్టగు నురమున్ మహాభుజము లంచిత కుండలకర్ణముల్ మదే
    భగతియు 'నీలవేణియుఁ గృపారసదృష్టియుఁ గల్గు వెన్నుఁడి
    మ్ముగఁ బొడకట్టుఁగాక కనుమూసిన యప్పుడు విచ్చినప్పుడున్.