పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/624

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

728

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

సమయానికి యావత్తు పద్యమూ జ్ఞప్తికి వచ్చింది కాదు. ఉదాహరించిందేచాలు శైలితెల్పడానికి. మనుచరిత్రపాకానికీ దీనికీ భేదం వుంటుంది.

“ఉ. చేసితిజన్నముల్ తపము చేసితినంటి దయావిహీనతన్
     జేసినకర్మముల్ ఫలముఁజెందునె? పుణ్యము లెన్నియేనియున్
     జేసినవాని సద్గతియె చేకుఱు భూతదయార్థ్రబుద్ధినో
     భూసురవర్య యింత తలపోయవు నీచదువేల? చెప్పుమా?"

యీ రచనలోవున్న ప్రసాదగుణం పుట్టుగుఁజెట్ల, పద్యంలో కనపడదు. కాని కొంచెంపిండివున్న వాళ్లకు ఆనందాన్ని కల్గించడాని కభ్యంతరంలేదు. అయితే కవికర్ణరసాయనంగాని, మనుచరిత్రగాని సర్వసాధారణంగా ‘లోకులరసనలె ఆకులుగా" వున్నాయని కాని, లేవనిగాని చెప్పగలమా? అధికారి తారతమ్యాన్నిబట్టి వుంటుందిగాని ఆయా విషయం సార్వత్రికమనడానికి అవకాశంలేదు.

పోనీ యిటీవలికవిత్వా లెందుకు? పరమగురువులుగా వుండే కవిత్రయం వారున్నారుగదా వారి కవిత్వాలే పుచ్చుకొని విచారిస్తే యుక్తంగా వుంటుందంటారేమో? అలా విచారించినా భారతంలో యేపర్వంలోవి కాని పట్టుమని పది పద్యాలు వచ్చినవారున్నారా అంటే : వున్నారని ధైర్యంగా జవాబుచెప్పడం కష్టం. భారత పద్యాలకంటే విజయవిలాసం పద్యాలు కంఠోపాఠంగా వచ్చినవారు చాలామంది కనపడతారు. వైజయంతీ విలాసంకూడా ఆలాటిదే. 1. ఉ. మ్రొక్కిన నెవ్వరేమనఁడు 2. ప్రకట జితేంద్రియుల్ (లోనైనవిచూడుడు). - -.

ఆ యీ ఘట్టం యావత్తూ నాకు కంఠోపాఠం. గాని యీ పుస్తకం నావద్ద యిప్పుడేకాదు యెప్పుడూలేదు. యెప్పుడో నెవరివద్దో చూచివున్నాను. తావన్మాత్రంచేత అవి యిప్పటికీ నాధారణలో వున్నాయి. దానికి కారణం నా ధారణా మాహాత్మ్యమంటారా? యీ విషయం చదువరులకే వదులుతూవున్నాను. సంకుసాల మహాకవి చెప్పినమాటకు యీ వైజయంతి లక్ష్యమవుతుందందామా? వెనక చూపిన దోషమే దీనికీ బాధకం.

“నఖలు సర్వో౽పి వత్సరాజః" అన్నారా లేదా? అలాగే ఎవరో “నఖలు సర్వో౽పి చెళ్లపిళ్లః" అని పూర్వపక్షం చేస్తారు. యిదేవిధంగా మఱికొందఱి కవిత్వాలను వుదాహరించగలను కాని ఆవుదాహరించడం గ్రంథాన్ని పెంచడానికే కాని ప్రకృతాని కావంతగాని కొంతగాని వుపకరింపదు. కనక పేకేజీ సరుకుమాటలు కట్టిపెట్టి మెల్లిగా ప్రధానాంశాన్ని వుపక్రమిస్తాను. యిప్పుడు యెవరిపేరులు స్పృశించివిడిచానో వారి