పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/619

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యేది కవిత్వం - 1

723


మ. గృహసమ్మార్జనమో? జలాహరణమో-వగయిరాలు చూచుకోండి. కృష్ణదేవరాయలు యింత మంచి కవిత్వం చెప్పేవాఁడే అయినా తఱుచుగా “ఒక్కొక సంకేతమ కా కతఁడ రస న్నేఁ గానే” మాదిరి కవిత్వమే చెప్పి వుండడంచేత ఆయన కవిత్వం ‘లోకులరసనలె యాకులుగా" వుండే తరగతిలోకి చేరింది కాదు - నా యెఱిఁగినంతలో ఆముక్తమాల్యదలో చాలా పద్యాలు కంఠోపాఠంగా వచ్చినవారల్లా కీ. శే. అల్లంరాజు సుబ్రహ్మణ్యం కవిగారు మాత్రమే. వ్యాఖ్యానం సమగ్రమైనది వున్నప్పటికీ ఆముక్తమాల్యదలో పద్యాలు యెన్నో అర్థంకానే కావు - కృత్యాద్యవస్థలో రాయలవారి వంశవర్ణన పద్యాలలో వున్న -

మ. అలుకన్ ఘోటకధట్టి కాఖురపుటీ హల్యన్ ఖురాసానిపు
     చ్చలు వోదున్ని .... .... .... జాంగల శ్రేణికిన్.

అనే పద్యంలో కొన్ని సంప్రదాయలున్నాయి. ఆ సంప్రదాయాలు తెలుసుకుంటేనే తప్ప (ప్రతిపదార్థం తెలుసుకొన్నప్పటికీ) అన్యథా దాని తాత్పర్యం కాదు - దానిఫలితార్థం తురుష్కరాజైన ఔదులఖానుణ్ణి కృష్ణరాయలు జయించాఁడని తేలుతుంది. తేలితేమాత్రం లాభమేమిటి? ఖురాసాని పుచ్చలు పోయేటట్టుగా దున్నడమేమిటి? వగయిరా శంకలు నివర్తించడానికి కొన్ని సంప్రదాయాలు తెలియాలి. అవన్నీ తెలిసినతర్వాత ఆపద్యంలో వున్న సొగసు ఆనందజనకం అవుతుంది. ఆ యీస్థితిలో వుండే కవిత్వపాకాన్నే నారికేళపాకం అన్నారు సహృదయులు. కొంత కష్టపడ్డతర్వాత కూడా యేవిధమైన ఆనందాన్నీ కలిగింపని కవిత్వమైతేనో? దానికి పేరేదీ వున్నట్టు లేదు. “తే కే న జానీమహే", ఆలంకారిక వామనుఁడు చెప్పిన “విచిత్రప్రకారాహి పదానాం ప్రవృత్తిః, వామనయనా, వామోరురితి భవతి, నతు వామవదనా వామచరణేతి" అనే సందర్భాన్ని రాయలు బొత్తిగా గమనించినట్లే లేదు - పదం శాస్త్రసిద్ధమవడమే కావలసింది గాని యితరంతో పని లేదనుకొని ఏ పక్షంలో ఆలాటి శబ్దాల కూర్పు చెవికి కంటకప్రాయంగా వుంటుంది. వైద్య శాస్త్రరీత్యా మూరుకొండ, నేపాళం, కసింత, వగయిరాలన్నీ భక్షణయోగ్యాలుగానే కనపడతాయి, యెందుచేతంటారా? తోటకూర, గోంగూర వగయిరాలకు వ్రాసినమాదిరిగుణాలే వాట్లకున్నూ వ్రాయడం అందఱూ యెఱిఁగిందేకదా? ఆలా వ్రాసినప్పంటికీ జనులకు (రోగంవస్తేతప్ప) అవి అన్నాధారాలుగా యేర్పడలేదు. (రోగికేనా మందుగా యిస్తే యిస్తారేమోగాని కూరగాకాదు) ఆలాగే శబ్దశాస్త్రరీత్యానిర్దుష్టమైనంత మాత్రంలోనే ఆపదం ప్రయోగార్హం కాదు - దీన్నే నన్నయ్యగారు “ఇహతు ప్రవ్యాహార్యం సంకేతిత సుప్రసిద్ధమేవపదమ్" అన్నారు. ఆలాటి సుప్రసిద్ధపదా లైనప్పటికీ దేనికీ దేనికీ లంకెబాగాకుదురుతుందో దానికీ దానికే సంబంధం కల్పాలి (చందన్కి చందన్మిలేతో)