పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/603

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

707



యేది సాధ్యం?

వ్రాసిందే వ్రాస్తూ వృథాగా పత్రికకు పనిచెపుతూ వున్నారుగదా! మీకు సాధ్యం యేమిటంటాను. (1) వెం. శా. కి అలంకారశాస్త్రపాండిత్యంగాని, యద్వా రసచుంబనోపాయంగాని పూర్ణానుస్వారం; యద్వాపుస్తకాపేక్ష అనేదే అయివుండునా? ఆలాక్కాకపోతే (2) "అమ్మా! మాదాకవళం తల్లీ" అనేది సహృదయు లంగీకరించే కవిత్వమే, శుభార్థమైన మహాసభలో వినిపించతగ్గ కవిత్వమే అనిపించుకోవడమే అయివుండునా? యీ రెంటిలో మీకు యేది సాధ్యం అని మిమ్మెవరేనా ప్రశ్నిస్తే మీరు చెప్పే జవాబేమిటి? నా౽౽ద్యః. యేమంటారా? యెంతమంది, వెం. శా. లకు యేమీ రాదని తేలినా మీకు లేశమున్నూ ప్రస్తుతం వుపయోగించేది లేదు. (పృష్ఠ తాడనా ద్దంతభంగః) వెం. శా. అపండితుఁడైనంతలో కవిత్వం కానిదల్లా కవిత్వం కాఁగల్లుతుందా? యింకేమిటంటే? ఆక్షేపకనిష్ఠమైన అపాండిత్యమే ప్రస్తుతం తేల్చుకో తగ్గది కనక, ఆలాటి మాటలు వ్రాయవలసి వచ్చిందంటారేమో? అయితే వినండి. మీరు ఏసభలో యీఅపభ్రంశ గేయపల్లవిని గానమాధుర్యాన్ని అనుపానంగా తోడుచేసి సభ సంతోషిస్తుందనే కుతూహలంతో చదివి వున్నారో, ఆసభలో వెం. శా. కన్న మిన్నగా అలంకారశాస్త్ర పరిశ్రమ చేసి రసాన్ని చుంబించే నేర్పుకలవా రెందఱు వుండివుంటారని ప్రశ్నిస్తే మీరు చెప్పే జవాబేమిటోకదా! (కొద్దికొద్ది ఆ యా విషయమ్ము లన్నియును నారసి లౌకిక చాతురీమతి, శ్రీ విభవమ్మునన్ జెలఁగి చేటున కాకరమౌ నసూయకున్, భావము లొంగనీక" చూ.) అసూయయున్నట్లు చూపఁగలరా! అది భావనాశక్తికి గోచరమే అయినా వివరించేది లేదు. మీకే అట్టే వుంచడం మంచిది. మీ స్వహస్తలిఖితాక్షరాలే చూచి సహృదయులానందించి మీ సాహసాన్ని అభినందించాలి. కాని, అంతటి సాహసం మీరు ప్రదర్శిస్తారో లేదో చూడాలి. శ్లో "రమ్యం జుగుప్సిత ముదార మథా౽పి నీచం... ... తన్నాస్తియన్న రసభావ ముపైతిలోకే" అని వొక శ్లోకాన్ని వుదాహరించారు మీరు. దీన్నిబట్టి "అమ్మా! మాదాకవళం తల్లీ" పల్లవి కవిత్వమవుతుందో కాదో కాని ప్రతిబంద్యుత్తరంగా నేను మొట్టమొదటనే వుదాహరించిన ఉ. “కొందఱు సోదరీమణులు. పెడమోమయలేచిరి గ్రుడ్డివెన్నెలన్" అనేది (జుగుప్సితం చూ.) కవిత్వమే సహృదయసమ్మతమే అని తేలుతుందని సంతోషిస్తాను. యేమంటే? అది కవిత్వమే అనిపించుకుంటుందని నేను స్వప్నే౽పీ అనుకొని వుండలేదు. మీరు