పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/601

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

“సహృదయాః ప్రమాణమ్”

705


క్షణం మొదలు యేతత్క్షణపర్యంతమూ - “మాదాకవళం" కవిత్వం నచ్చనేలేదు. కనక ఆత్మవంచన లేకుండా నాహృదయాన్ని నేను వెల్లడించవలసి వచ్చింది. “నీకు యేమీ తెలియదు” అని వొక్కచిన్నవాక్యం వ్రాస్తే సరిపోయేదానికి గేయకర్తగారు చాలా గ్రంథం పెంచి వ్రాశారు. దానికి ఫలితార్థం ఆవాక్యంకన్న విశేషించి కనపడదు. యింతమట్టుకు నేను లోఁగడ కంఠోక్తిగా అంగీకరించిందే - యిఁకనల్లా నేను ప్రతిబంద్యుత్తరంగా కనబఱచిన- “కొందఱు సోదరీమణులు” అనేపద్యం వుంది, దీనిసమర్ధనం నేను (ఆలంకారిక గ్రంథపరిచయం చాలక) చేయలేను గాని గేయకర్తగారైతే (నాతరఫున వకాల్తనామా పుచ్చుకుంటే) వూరుకోరు. అయితే అది ఆయన కవిత్వం గాదు కనక మనకెందుకని వూరుకున్నారనుకుంటాను-లేదా! అవసరమైతే సమర్ధనానికి పూనుకుంటారేమో?

"వాదీదౌర్బల్యమే కాని వాదదౌర్బల్యం” వుండదుగదా? రఘునాథాచార్యులవా రేమన్నారు! “మయి జల్పతి కల్పనాధినాథే రఘునాథే మనుతాంత దన్యదైవ” అల మతివిస్తరేణ. యీవిషయం వివదనీయం కాదు. వృథాగా పత్రికలకు పనిచెప్పడం అనవసరం. నాకు నచ్చకే నచ్చలేదన్నాను గాని గ్రంథకర్తను అవమానించడానికి కాదు. : ఆయనకీ నాకూ యేవిధమైన వ్యక్తిద్వేషమూలేదు — “కాలం మాఱింది కవిత్వరుచి మాఱింది" అనే అర్థమిచ్చే మాటలు గేయకర్తగారు వ్రాశారు. యెంత మాఱినా యింకా యీవిధమైనది కవిత్వమనుకొనే దాఁకా రాలేదనే నా వెఱ్ఱినమ్మకం.

"శ్లో. అద్యా౽ ప్యస్తి చతుస్సముద్రవలయీభూతం ధరామండలం
      సంత్యన్యే౽పిచ తత్రతత్ర విదుషాంగోష్ఠీషు బద్ధాదరాః"

అర్థమే లేనిమాటలు విడివిడి గ్రూపులుగా అచ్చొత్తించి ప్రచురించడంకన్న (యీ అచ్చుకూడా కొత్తమాదిరి) “మాదాకవళం" కొంత మెఱుఁగే అనిమాత్రం నాకు తోఁచింది. "యెంకిపాటలు" పరమోన్నతస్థానంలో నిల్చి వున్నాయనేది కూడా నేను విశ్వసింపలేను. సహృదయశబ్దం యెవరిని చెపుతుంది? యింకొకమాట-

ధ్వన్యాలోకం లోనైన గ్రంథాలు ప్రాచీనకవిత్వాలనే చాలాభాగం తూఱుపాఱఁబట్టినట్లు కనపడుతుందిగదా? అవి వీట్లని సమర్థిస్తాయా! పైఁగా అవి శబ్దార్థాలు రెండూ నిర్దుష్టాలుగా వుండనిదే వాట్లని దగ్గిఱకేరానివ్వవు, (అలంకారశాస్త్ర గ్రంథకర్తల కవిత్వంకూడా యెందుకూ కొఱగానిది బోలెఁడు వుంది. చూపవలసివస్తే వ్యాసం పెరుగుతుంది) వాట్లని స్పృశింపనే స్పృశింపవు. “ప్రథమకబళే మక్షికాపాతః" అన్నట్టుగా శబ్దసౌష్ఠవాన్ని పూర్తిగా వదులుకొన్ని నేఁటికవిత్వాలను ఆగ్రంథాలద్వారా సమర్థించడానికి పూనుకోవడం హాస్యాస్పదం. దీని పేరే